దర్శక ధీరుడు.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా.. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన ఘనుడు.. ఇవీ రాజమౌళి గురించి తరచుగా వినిపించే పొగడ్తలు. బయటి ఇండస్ట్రీలు, వేరే భాషల ప్రేక్షకులే జక్కన్నను ఆకాశానికి ఎత్తేస్తుంటే.. ఇక తెలుగు ఆడియన్స్ సంగతి చెప్పేదేముంది? కెరీర్లో తొలి పదేళ్లయినా కొంత విమర్శలు ఎదుర్కొన్నాడు కానీ.. తర్వాతి దశాబ్దంలో మాత్రం జక్కన్న మీద ఎప్పుడూ ప్రశంసల వర్షమే కురుస్తోంది.
సామాజిక మాధ్యమాల్లో కూడా ఎప్పుడూ రాజమౌళికి మద్దతుగానే ట్రెండ్స్ నడుస్తుంటాయి. కానీ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాజమౌళి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుండటం గమనార్హం. జక్కన్నను ఇప్పుడిలా టార్గెట్ చేసింది ఎవ్వరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. తమ హీరో సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడానికి రాజమౌళినే కారణమన్న ఉద్దేశంతో ఆయన మీద మంగళవారం ఉదయం నుంచి విరుచుకుపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.
ఆర్ఆర్ఆర్‌కు రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత ఓ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. పండుగ టైంలో ఎన్ని సినిమాలైనా రావచ్చని, బాగుంటే అన్ని సినిమాలూ చూస్తారని, దేనికి ఏదీ పోటీ కాదని వ్యాఖ్యానించాడు రాజమౌళి. కానీ తర్వాత ఆర్ఆర్ఆర్ పోటీగా ఉన్న సర్కారు వారి పాట, భీమ్లా నాయక్‌లను వాయిదా వేయించడానికి రాజమౌళే ఒత్తిడి తెచ్చాడని, ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే రావాలని పట్టుబట్టిన భీమ్లా నాయక్ టీం మీద విపరీతమైన ప్రెజర్ పెట్టించి వాయిదా వేయించాడన్నది పవన్ అభిమానుల ఆరోపణ.
ఇక భీమ్లా నాయక్ వాయిదా నిర్ణయం తర్వాత ముందుగా మహేష్ బాబును పొగడ్డం, సర్కారు వారి పాటను వాయిదా వేసుకోవడం ద్వారా ముందు మహేషే ఇనిషియేషన్ తీసుకున్నాడంటూ కొనియాడటం, మై హీరో అని విశేషణం జోడించడం.. సర్కారు వారి పాటను పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని పేర్కొనడం.. తర్వాతేమో పవన్‌కు మొక్కుబడిగా ఒక థ్యాంక్స్ చెప్పడం కూడా మెగా అభిమానులకు నచ్చలేదు. రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడైనా.. ఆయనకు క్యారెక్టర్ లేదని, ఇంకా ఏవేవో తిట్లు తిడుతూ ఆయన్ని చాలా గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.