ఈమద్య కాలంలో సౌత్ మూవీలు ఉత్తరాదిన భారీగా వసూళ్లను రాబడుతూ ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు బాలీవుడ్ సినిమాలు దక్షిణాదికి వచ్చేవి. కాని ఇప్పుడు సౌత్ సినిమాలు ఎక్కువగా ఉత్తరాదికి వెళ్లి అక్కడ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొన్ని డైరెక్ట్ గా థియేటర్లలో విడుదల అవుతుండగా, మరి కొన్ని డబ్ అయ్యి టీవీల్లో ప్రసారం అవుతున్నాయి, మరి కొన్ని సినిమాలు నేరుగా యూట్యూబ్ లో విడుదల అవుతున్నాయి. అల్లు అర్జున్ తన హిందీ డబ్బింగ్ చిత్రాలతో యూట్యూబ్ లో సాగిస్తున్న సందడి అంతా ఇంతా కాదు. పలు రికార్డులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అక్కడ యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది.
పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్ చిత్రాల జాబితాలో అజ్ఞాతవాసి ముందు వరుసలో నిలిచిన విషయం తెల్సిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ తో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. డిస్ట్రిబ్యూటర్లు కోట్లల్లో లాస్ అయ్యారనే టాక్ వచ్చింది. అలాంటి అజ్ఞాతవాసి ఇప్పుడు హిందీ డబ్బింగ్ వర్షన్ తో ఆల్ టైం రికార్డును దక్కించుకుంది. ఏ సౌత్ సినిమాకు కూడా దక్కని అరుదైన రికార్డును అజ్ఞాతవాసి దక్కించుకుని మెగా ఫ్యాన్స్ గర్వపడేలా చేస్తోంది.
ఈనెల 20వ తేదీన ‘అజ్ఞాతవాసి’ హిందీ డబ్బింగ్ వర్షన్ ను ‘ఎవడు 3’ అనే టైటిల్ తో విడుదల చేయడం జరిగింది. గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ వారు యూట్యూబ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అనూహ్యంగా ఈ చిత్రంకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కేవలం 48 గంటల్లో ఏకంగా 18 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా కూడా జోరు కొనసాగుతూనే ఉంది. మూడవ రోజుకు 22 మిలియన్ ల వ్యూస్ తో దూసుకు వెళ్తూనే ఉంది. గతంలో తమిళ ‘వివేగం’ చిత్రం 24 గంటల్లో 9.4 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పుడు ఆ రికార్డును అజ్ఞాతవాసి బ్రేక్ చేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
చరణ్ హీరోగా వచ్చిన ‘ఎవడు’ చిత్రాన్ని అదే పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. చరణ్ గోవిందుడు అందరి వాడేలే చిత్రాన్ని ‘ఎవడు 2’ అంటూ హిందీలో డబ్ చేశారు. ఇప్పుడు అజ్ఞాతవాసి ని ‘ఎవడు 3’ అంటూ విడుదల చేయడం జరిగింది. ‘ఎవడు’, ‘ఎవడు 2’ చిత్రాలకు అంతంత మాత్రంగానే వ్యూస్ వచ్చాయి. కాని పవన్ ‘ఎవడు 3’ మాత్రం ఆల్ టైం రికార్డును దక్కించుకునేలా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జోరు చూస్తుంటే అతి త్వరలోనే 100 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న చిత్రంగా కూడా రికార్డు దక్కించుకుంటుందేమో అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
తెలుగులో ఫ్లాప్ అయినా అక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. పవన్ కు జోడీగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ మరియు అను ఎమాన్యూల్ లు నటించారు.