‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిజల్ట్ నుంచి త్వరగానే తేరుకుని తన తర్వాతి సినిమాను మొదలుపెట్టేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎస్.జె.సూర్య ఫామ్ కోల్పోయి చాలా కాలమైనా సరే.. తనకు చివరగా ‘పులి’ లాంటి డిజాస్టర్ ఇచ్చినా సరే.. మళ్లీ అతడితోనే సినిమా చేయబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. గత దశాబ్ద కాలంలో తమిళంలో కూడా సూర్య చేసిన ఏ సినిమా కూడా ఆడలేదు. చివరికి దర్శకత్వం పక్కనబెట్టేసి హీరోగా సినిమాలు చేస్తూ నెట్టుకొస్తున్నాడతను. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య ఎలాంటి కథ రాశాడు.. ఎంత మంచి స్క్రిప్టు తీర్చిదిద్దాడు అనే విషయంలో జనాలకు చాలా సందేహాలున్నాయి. ఐతే సూర్య రెడీ చేసిన స్క్రిప్టులో అతడి ప్రమేయం తక్కువే అని.. ఇది ఓ తమిళ సినిమా ఆధారంగా ఆకుల శివ తీర్చిదిద్దిన స్క్రిప్టు అని ప్రచారం జరుగుతోంది.
తమిళంలో రెండేళ్ల క్రితం అజిత్ హీరోగా వచ్చిన ‘వీరం’ పెద్ద హిట్టయింది. పవన్ కు సన్నిహితుడైన ఎ.ఎం.రత్నం ఆ సినిమాకు నిర్మాత. తనతో ఓ సినిమా చేస్తానని పవన్ కమిట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో రత్నం ఆ సినిమా హక్కుల్ని పవన్ కు ఉచితంగా ఇచ్చేశాడట. ఆ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చి కథ తయారు చేసినట్లు చెబుతున్నారు. సూర్యతో తాను చేయబోయేది ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ఓ ఫ్యాక్షనిస్టు ప్రేమకథ అని సూర్య చెప్పాడు. ‘వీరం’లో హీరో కూడా పెద్ద రౌడీ. అతడికి నలుగురు తమ్ముళ్లుంటారు. పెద్దరికం సినిమా తరహాలో ఆ ఐదుగురు అన్నదమ్ములకు ఆడాళ్లంటే పడదు. పెళ్లే వద్దనుకుంటారు. కానీ తమ్ముళ్లు ప్రేమలో పడి.. అన్నయ్యకు కూడా ఆడవాసన రుచిచూపిస్తారు. తర్వాత అతను ప్రేమలో పడతాడు. పవన్-సూర్య చెబుతున్న మాటల్ని బట్టి చూస్తుంటే ‘వీరం’ కథతో పోలికలు కనిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతో ఇంకొన్ని రోజుల్లో బయటపడక మానదులెండి.