ఫాదర్ పాత్రలో పవర్ స్టార్ పర్ఫెక్ట్

Update: 2016-12-18 17:30 GMT
పవన్ కళ్యాణ్ కు సమాజం మీద బోలెడంత అవగాహన ఉంది. అవన్నీ ఆయన మాటల్లో కనిపిస్తూ ఉంటాయి కూడా. రాజకీయ వేదికల సంగతి పక్కన పెట్టి.. సినిమాల వరకూ చూసుకుంటూ ఆయన పవర్ స్టార్. క్రేజ్ లో తనకు సాటి రాగలవాళ్లు దగ్గర్లో ఎవరూ కనిపించరు. తన మీద అభిమానాన్ని పవనిజం అంటూ మతం రేంజ్ కి తీసుకెళ్లిన పవన్.. వ్యక్తిగత వ్యవహారాల్లోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు.

ముఖ్యంగా తన పిల్లలపై ప్రేమ చూపించడంలో.. తండ్రిగా తన బాధ్యతలు నిర్వహించడంలో పవన్ ఎప్పుడూ ఎలర్ట్ గా ఉంటాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ జరుగుతున్నపుడు.. సడెన్ గా సినిమాకి బ్రేక్ ఇచ్చేసి పూనే వెళ్లిపోయాడు ఇందుకు కారణం.. తన కొడుకు అకీరా అక్కడ స్టేజ్ పై పెర్ఫామెన్స్ ఇస్తుండడమే. కొడుకు-కూతురుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాదు.. ఇప్పటికీ మాజీ భార్య రేణూ దేశాయ్ కు సంబంధించిన ఆర్థిక అవసరాలను కూడా పవన్ కళ్యాణే చూసుకుంటున్నాడని అంటారు.

ఈ విషయంలో కుటుంబాల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటాడట పవన్. పవర్ స్టార్ కదా.. ఆ మాత్రం పవర్ ఫుల్ గా ఉండడంలో ఆశ్చర్యం లేదులే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News