పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రూవ్ చేసింది. రిలీజ్ రోజున ఈ చిత్రం వసూలు చేసిన షేర్ 31 కోట్ల రూపాయలు. ఇది ఇండస్ట్రీ బెస్ట్ కాదు కానీ.. నాన్ బాహుబలి రికార్డ్ అనే విషయం తెలిసిందే.
రీసెంట్ గా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ మూవీ ఫ్యాన్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఫస్ట్ డే కలెక్షన్స్ 19.2 కోట్లు. ఈ అంకెలు చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. పవన్ ఒక టాలీవుడ్ స్టార్ మాత్రమే. హిందీలో ఓ ఎటెంప్ట్ చేసినా.. అది ఘోరంగా విఫలమైంది. కర్నాటకలో కూడా పవన్ వసూళ్లు బాగానే రాబడతాడు. కానీ షారూక్ ఖాన్ అలాక్కాదు. ఇంటర్నేషనల్ గా ఇమేజ్ ఉన్న కలెక్షన్ల బాద్షా.
మరి షారూక్ ఫ్యాన్ కంటే పవన్ సర్దార్ కి కలెక్షన్స్ అంత ఎక్కువగా ఉండడం.. ఇక్కడ పవన్ కి ఉన్న క్రేజ్ కి నిదర్శనం. అయితే.. తొలి రోజు తర్వాత సర్దార్ పూర్తిగా సౌండాఫ్ అయిపోయాడు. కానీ షారూక్ ఖాన్ ఫ్యాన్ మాత్రం.. రోజురోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుండడం విశేషం. ఇప్పటికి పవన్ సర్దార్ కి 87 కోట్ల గ్రాస్ రాగా.. ఈ మొత్తాన్ని షారూక్ వీకెండ్ లోపే దాటేస్తాడని అనడంలో సందేహం అక్కర్లేదు.