కొడుకుని కెమేరాలో కట్టేసిన పవన్

Update: 2015-12-19 10:16 GMT
పవన్ కళ్యాణ్ ఎప్పడూ బిజీగా ఉంటాడు. ఒక వైపు సినిమాల సంగతి చూసుకుంటూనే.. మరోవైపు రాజకీయాలను పరిశీలిస్తాడు పవన్. ఇప్పుడు సర్దార్ గబ్బర్ షూటింగ్ ని శరవేగంగా కంప్లీట్ చేస్తున్న ఆయన.. మధ్యమధ్యలో రాజకీయ నాయకులతోనూ కనిపిస్తూ ఉంటాడు.

ఇంత బిజీగా ఉన్నా.. కొడుకు అకీరాకి సంబంధించిన ఈవెంట్లలోనూ ప్రత్యక్షం అవుతూ.. పర్ఫెక్ట్ తండ్రి అనిపించుకుంటూ ఉంటాడు పవన్. ప్రస్తుతం పవర్ స్టార్ నుంచి విడాకులు తీసుకుని విడిగా జీవిస్తున్న రేణూ దేశాయ్.. కొడుకు - కూతురుతో కలిసి పూనేలో ఉంటున్నారు. అక్కడే చదువుకుటున్నాడు కొడుకు అకీరా. క్రిస్మస్ పండుగ రానుండడంతో.. అకీరా చదువుతున్న స్కూల్ లో.. ప్రీ క్రిస్ మస్ ఈవెంట్స్ కొన్ని నిర్వహించారు. వీటిలో ఒకదానిలో అకీరాతోపాటు, వాళ్లమ్మ రేణూ దేశాయ్ కూడా పెర్ఫామ్ చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్.. మొదటి వరుసలో కూర్చుని కొడుకు ప్రదర్శనను మొదటి నుంచి చివరివరకూ ఆసక్తిగా తిలకించాడు. అంతే కాదు. తన మొబైల్ లోని కెమేరాతో కొడుకు పెర్ఫామెన్స్ ని షూట్ కూడా చేశాడు. మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ అకీరాని ప్రోత్సహించాడు పవన్.

మరి కొడుకు స్టేజ్ పెర్ఫామెన్స్ ఇస్తున్నాడంటే ఏ తండ్రికైనా అలాంటి ఆనందమే ఉంటుంది. ప్రపంచానికి ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ.. కొడుకుకి మాత్రం తండ్రే కదా. అందుకే తన ఉత్సాహాన్ని ఆపుకోలేక.. అలా ప్రవర్తించి, కొడుకు దగ్గర ఏ తండ్రైనా ఒకటే అని ప్రూవ్ చేసేశాడు పవన్.
Tags:    

Similar News