కొమరం పులి ఫ్లాపైతే పవన్ గిఫ్టిచ్చాడట

Update: 2016-05-03 15:30 GMT
తనకు పెద్ద ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో ఓ స్టార్ హీరో మళ్లీ మాట్లాడ్డమే కష్టం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఓ దర్శకుడికి గిఫ్టులిచ్చాడట. దర్శకుడిని ఓదార్చి.. అతడిలో ధైర్యం నింపాడట. ఆ సినిమా కొమరం పులి కాగా.. ఆ దర్శకుడు ఎస్.జె.సూర్య. తాను సక్సెస్.. ఫెయిల్యూర్ల ఆధారంగా ఎవరితో సంబంధాలు కొనసాగించనని చెబుతూ పవన్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘‘నేను ఓ వ్యక్తిని నమ్మానంటే ఎప్పుడూ వాళ్లతో ఒకేలాగా ప్రవర్తిస్తాను. నా సినిమాల సక్సెస్ లకు.. ఫెయిల్యూర్లకు నేను ఏమాత్రం చలించను. నా సినిమాలు పెద్ద హిట్టయినపుడు సంబరాలు చేసుకోలేదు. ఫ్లాపైనపుడు కుంగిపోలేదు. అలాగే సక్సెస్ ఫెయిల్యూర్లను బట్టి దర్శకులతో సంబంధాలు కొనసాగించలేదు. ఓ వ్యక్తిని నమ్మానంటే నేను వాళ్లతో కంటిన్యూ అవుతాను. వాళ్ల కోసం నిలబడతాను.

కొమరం పులి సినిమా పెద్ద ఫ్లాప్ అయినపుడు అందరూ నిరాశలో ఉన్నారు. ఎస్.జె.సూర్య సైతం చాలా డిజప్పాయింట్ అయినట్లు కనిపించారు. ఐతే నేనే ఆయనకు ధైర్యం చెప్పాను. నా నుంచి గిఫ్టులు కూడా పంపించాను. ఎందుకంటే ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి ఒక వ్యక్తిని ధ్వేషించడం కరెక్ట్ కాదు. క్రియేటివ్ ప్రాసెస్ లో ఫెయిల్యూర్లనేవి సహజం. సినిమా ఫ్లాపైందని దర్శకుల్ని కించపరచకూడదు’’ అని పవన్ అన్నాడు. ‘కొమరం పులి’ అంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. ఎస్.జె.సూర్యతో మరోసారి పవన్ ఎందుకు సినిమా చేస్తున్నాడో అని సందేహించిన వాళ్లకు ఈ వ్యాఖ్యలతో సమాధానం దొరికినట్లే భావించొచ్చు.
Tags:    

Similar News