తన సినిమాల్లో విలన్లు పవర్‌ఫుల్‌గా ఉండాలంటారు పవన్‌కళ్యాణ్. వాళ్లు ఎంత పవర్‌ఫుల్ అయితే, తన పాత్ర అంత బాగా పండుద్దనేది పవన్ ఆలోచన. నిజంగానే విలన్‌తోనూ, వాళ్ల గ్యాంగ్‌తోనూ పవన్‌కళ్యాణ్ చేసే సందడి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. అందుకే 'గబ్బర్‌సింగ్2'కోసం పవన్ ప్రత్యేకమైన కసరత్తులు చేసి విలన్‌ని ఎంపిక చేసుకొన్నట్టు సమాచారం.
కేవలం విలన్‌ని ఎంపిక చేసుకొనేందుకే ఆయన బోలెడంత సమయం తీసుకొన్నారట. చివరికి మరాఠీలో ఆమధ్య విడుదలైన రితేశ్ దేశ్‌ముఖ్ సినిమా లాయ్‌బారీ చూశాక అందులో విలన్‌గా నటించిన శరద్‌కేల్కర్ పవన్‌కి బాగా నచ్చాడట. వెంటనే ఆయన్ని సంప్రదించి తన సినిమాకోసం ఎంపిక చేసుకొన్నట్టు తెలిసింది. ఇటీవల మహారాష్ట్రలో తీసిన తొలి షెడ్యూల్ సన్నివేశాలన్నీ ఆ విలన్‌పైనే తీసినట్టు సమాచారం.
పవన్‌కళ్యాణ్‌లాంటి స్టార్ కథానాయకుడి నుంచి పిలుపొచ్చేసరికి శరద్ కేల్కర్ ఎగిరి గంతేశాడట. ఈ అవకాశాన్ని పక్కాగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన డిసైడ్ అయినట్టు తెలిసింది. ఆ మేరకుఇప్పటికే తెలుగు భాషని బాగా నేర్చేసుకొనే పనిలో పడ్డాడట. సెట్‌లోనూ తన డైలాగులు తానే పలికేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఆయన చేసిన సన్నివేశాలు చూశాక పవన్ కూడా హ్యాపీగా ఫీలయ్యాడట. 'గబ్బర్‌సింగ్2' తదుపరి షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్‌లో మొదలవుతున్నట్టు తెలిసింది.