హార్వర్డ్ లో లెక్చర్ ఇవ్వబోతున్న పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే ఆన్సర్ అంత సింపుల్ కాదు. దీనికి కారణం.. అటు పవర్ స్టార్ గా కాటమరాయుడు షూటింగ్ ఫినిష్ చేయడం.. త్రివిక్రమ్ తో కొత్త సినిమా పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లలో బిజీ. మరోవైపు.. రాజకీయంగా జనసేన పార్టీ అధినేతగా ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్నాడు.
ఇన్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ విద్యార్హత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. తాను ఇంటర్ వరకే చదివానని తనే ఓపెన్ గా చెప్పేశాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కి ఇప్పుడు ఓ అరుదైన అవకాశం లభించింది. తాజాగా పవన్ కు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పిలుపు వచ్చింది. ఇండియన్ కాన్ఫరెన్స్ 2017లో ప్రసంగించాల్సిందిగా పవన్ కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. తాను చదివినది కేవలం ఇంటర్ అయినా.. ప్రజా సమస్యలపై పోరాటం.. ఇటు పవర్ స్టార్ గా ఎదిగిన తీరు.. పవన్ కు ఈ అకాశం కల్పించాయని చెప్పాలి.
కేవలం ఇంటర్ చదివిన వ్యక్తికి హార్వర్డ్ లెక్చర్ ఇచ్చే అవకాశం అంటే.. అది ఖచ్చితంగా పవన్ ప్రతిభా పాటవాలకు దక్కిన గౌరవంగా చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/