జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఓసారి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన సంగతి తెలుసా... చదువుకునే రోజుల్లో ఆయన నిజంగానే చనిపోవాలని ప్రయత్నించాడట. అయితే.. అన్నయ్య చిరంజీవి వదినలు ఆపి హితబోధ చేయడంతో అక్కడి నుంచి మనసు దృఢ పరుచుకున్నాడట. రీసెంటుగా ఓ మ్యాగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఈ సంగతులున్నీ చెప్పాడు.
విద్యార్థి దశలో ఏమి సాధించడం లేదనే ఫీలింగ్ తో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించానని పవన్ కల్యాణ్ తెలిపారు. చిన్నతనంలో అనారోగ్యంతో కారణంగా చదువు సరిగా అబ్బలేదట.. దాంతో ఎప్పుడూ పరీక్షల్లో ఫెయిలయ్యేవాడట పవన్. దాంతో సూసైడ్ చేసుకోవాలని కూడా ప్రయత్నించాడట. ‘‘ఇంటర్ పరీక్షలు రాసే సమయంలో కాపీ కొట్టే అవకాశం వచ్చినా ఆ పని చేయలేదు. కాపీ కొట్టడానికి అంతరాత్మ అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొన్నాను. వచ్చింది రాసి బయటకు వచ్చేయడంతో యథావిధిగా ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అవ్వడం కొత్తకాదు కనుక పట్టించుకోలేదు. మరోసారి ప్రయత్నించినా పాస్ కాలేకపోయాను. దాంతో మానసికంగా బాధపడ్డాను.. యుక్త వయస్సులో నా తోటివారందరూ చదువులోను - క్రీడల్లోనూ రాణిస్తుంటే చూసి బాధగా ఉండేది. పేపర్లో చూస్తే సచిన్ టెండూల్కర్ - విశ్వనాథ్ లాంటి చిన్నవయస్సులోనే అద్భుతమైన ప్రతిభను చూపిస్తున్నారనే వార్తలు కనపడేవి. నాకే ఎందుకలా అవుతున్నది. నేను ఏమి సాధించలేక పోతున్నాను అనే నిస్పృహ వెంటాడేది. దాంతో మానసికంగా కుంగిపోయాను అని పవన్ కల్యాణ్ తన భావాలను పంచుకొన్నారు. ఒత్తిడితో ఆత్మహత్యకు ప్రయత్నించా’’ అని చెప్పారు.
పవన్ ఆత్మహత్యకు ట్రయ్ చేయగా ఇంట్లో వాళ్లు చూసి కాపాడారట. అన్నయ్య చిరంజీవి - వదిన సురేఖ మానసిక స్థైర్యాన్ని నింపారని పవన్ చెప్పాడు. ‘‘‘డిగ్రీలు చదివితేనే చదువు కాదు. నువ్వు చదివినా చదవకపోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం. ముందు, నీకేం కావాలో నిర్ణయించుకో' అని సలహా ఇచ్చారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. జానీ తర్వాత సినిమాలు మానేద్దామనుకున్నాను. కాని ఆ తర్వాత 22 సినిమాలు చేశాను అని పవన్ కల్యాణ్ చెప్పారు. అదండీ పవన్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ కథలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/