పవన్ కళ్యాణ్ తో సినిమా అంటేనే ఎగిరి గంతేస్తారు ఏ దర్శకులైనా. అలాంటిది చేతిలో ఒక్క హిట్టు లేని దర్శకుడికి పవన్ ఛాన్సిస్తే ఆ ఆనందం ఇంతా అంతా కాదు.. కానీ పాపం ఓ చిన్న దర్శకుడికి పవన్ ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగుతూ... ఏడిపించేస్తున్నాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు సంతోష్ శ్రీనివాస్.
కందిరీగ రభస సినిమాలను తెరకెక్కించాడు సంతోష్. ఆ రెండు పెద్ద హిట్లు కొట్టలేదు. పవన్ కోసం ఓ కథ రాసి స్ర్కిప్టు వినిపించాడు. పవన్ ఓకే చెప్పాడు. ఇదంత ఇప్పుడు కాదు...అజ్ఞాతవాసికి ముందు. అప్పుడెప్పుడో కథకు ఓకే చెప్పినా.. త్రివిక్రమ్ తోనే ముందు సినిమా చేయడానికి సిద్దపడ్డాడు పవన్. దీంతో ఏడాది పాటు వెయిట్ చేశాడు సంతోష్. త్రివిక్రమ్ సినిమా కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తరువాత పవన్ రాజకీయాలలో బిజీ అయిపోయాడు. రాజకీయ రథయాత్ర మొదలుపెట్టాడు. జిల్లా జిల్లాకు తిరగసాగాడు. అందుకని తాను ఇక సినిమాలు చేయనని చెప్పేశాడు. ఆ మాటతో సంతోష్ చాలా బాధపడిపోయాడు. కథను ఎవరికి వినిపించకుండా అలా పవన్ కోసమే దాచిపెడితే... పవర్ స్టార్ సినిమాలకు గుడ్ బై చెప్పేయడంతో షాక్ కు గురయ్యాడు.
పవన్ కూడా విషయం అర్థంచేసుకుని సంతోష్ కోసం ఆ ఒక్క సినిమా చేసేద్దామని ఈ మధ్యనే అనుకున్నాడట. ఆ కుర్ర దర్శకుడిని పిలిచి స్క్రిప్టులో మార్పులు చేయమని చెప్పాడు. కొన్ని సీన్లు తీసేయమని చెప్పాడు. పవన్ చెప్పినట్టే కొన్ని సీన్లు తీసేసి - కొత్త సీన్లు రాసి తీసుకెళ్లాడు. ఇలా రెండు మూడు సార్లు చేశాడు. ఇప్పుడు మళ్లీ స్క్రిప్టులో మార్పులు చేయమని చెప్పాడట పవన్. తీరా అన్ని మార్పులు చేశాక పవన్ వద్దంటాడేమోనని భయం పట్టుకుంది సంతోష్ కు. పాపం పవన్ ని నమ్ముకుంటే... ఇలా ఆడేసుకుంటున్నాడేంటీ అతనితో... గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.