మెగాస్టార్ చిరంజీవి వెళ్లిపోయాక.. తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరో తేల్చడం కష్టమైపోయింది. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు.. ఈ ఇద్దరిలో ఎవరికి కుర్చీ కట్టబెట్టాలో చెప్పలేని పరిస్థితి. పవన్ ‘గబ్బర్ సింగ్’తో మోత మోగిస్తే.. మహేష్ ‘దూకుడు’తో తనేంటో చూపించాడు. తర్వాత పవన్ ‘అత్తారింటికి దారేది’తో తన పవర్ చూపిస్తే.. మహేష్ ‘శ్రీమంతుడు’తో తన స్టామినా బయటపెట్టాడు. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ - బ్రహ్మోత్సవం చిత్రాల రిజల్ట్ ను బట్టి మరోసారి ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది. కలెక్షన్ల పరంగా కాకుండా ఈ హీరోల స్టామినా కొలవడానికి ఉన్న మరో మార్గం రెమ్యూనరేషన్. ఈ విషయంలోనూ వీళ్లిద్దరూ ఎవరికి ఎవరూ తీసిపోయేలా లేరు.
‘శ్రీమంతుడు’ సినిమాకు మహేష్ నిర్మాణ భాగస్వామి కూడా కావడంతో దాదాపు రూ.20 కోట్ల దాకా రెమ్యూనరేషన్ వర్కవుట్ అయినట్లు వార్తలొచ్చాయి. ఇక ‘బ్రహ్మోత్సవం’కు ఏకంగా పాతిక కోట్ల మార్కును టచ్ అయిపోయినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ చిత్రంలో కూడా మహేష్ బాబు బేనర్ హ్యాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఐతే నిర్మాణ వ్యవహారాల జోలికి రాకుండా.. మొత్తంగా రూ.25 కోట్లకు పీవీపీ సంస్థ సెటిల్ మెంట్ చేసినట్లు ఆ మధ్య వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో రెమ్యూనరేషన్ పరంగా మహేషే నెంబర్ వన్ అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఐతే పవన్ కళ్యాణ్ కూడా మహేష్ కు ఏమాత్రం తీసిపోడని.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు పవర్ స్టార్ కూడా మహేష్ కు ఏమాత్రం తగ్గకుండా పారితోషకం తీసుకుంటున్నాడని సమాచారం. ఈ సినిమాను నిర్మిస్తోంది పవన్ మిత్రుడు శరత్ మరారే అన్న సంగతి తెలిసిందే. అందుకే పవన్ కు ఇంత అని రెమ్యూనరేషన్ ఇవ్వకుండా పవన్ కు వాటా ఇస్తున్నట్లు సమాచారం. సినిమా బడ్జెట్ తో పోలిస్తే డబుల్ ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఆ రకంగా అన్ని లెక్కలూ తేలేసరికి పవన్‌కు పాతిక కోట్లకు తక్కువ కాకుండా వర్కవుట్ అవుతోందట. కాబట్టి మూడేళ్లు గ్యాప్ తీసుకున్నప్పటికీ.. పవన్ పవర్ ఏమాత్రం తగ్గలేదన్నమాటే.