పవన్ వస్తున్నాడు.. ఏర్పాట్లు భారీగానే

Update: 2016-11-06 09:30 GMT
మామూలుగా సప్తగిరి హీరోగా నటించిన సినిమా ఆడియోను రిలీజ్ చేయడానికి ఒక వేడుక చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రసాద్ ల్యాబ్ లాంటి చోట చిన్న కార్యక్రమం చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నపుడు ఆ వేడుకను సింపుల్‌ గా ముగించేద్దామంటే కుదరదు. పవన్ వచ్చాడంటే సినిమాకు ఎంత పెద్ద బూస్టో కదా.. అలాంటపుడు ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. పబ్లిసిటీకి ఉపయోగించుకోవాలి. అందుకే సప్తగిరి హీరోగా పరిచయమవుతున్న ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఆడియో వేడుకకు ఏర్పాట్లు కొంచెం భారీగానే జరుగుతున్నాయి.

ఆదివారం సాయంత్రం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఆడియో వేడుక చేయనున్నారు. పవన్ వస్తున్నాడంటే అభిమానులు కూడా భారీగానే తరలి వస్తారు. అందుకే పెద్ద ఆడిటోరియం ఎంచుకున్నారు. అక్కడ ఏర్పాట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. భద్రత ఏర్పాట్ల విషయంలోనూ జాగ్రత్త పడుతున్నారు. సినిమాను తక్కువ బడ్జెట్లోనే చేసినా.. ఆడియో వేడుకకు మాత్రం చాలానే ఖర్చు పెడుతున్నారు. ఐతే పవన్ ముఖ్య అతిథిగా కన్ఫమ్ కావడంతో ఈ ఆడియో వేడుక ప్రసార హక్కులు కూడా మంచి ధరకే అమ్మినట్లు సమాచారం. ఈ వేడుకకు త్రివిక్రమ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ దర్శకుడు అరుణ్ పవార్.. త్రివిక్రమ్ దగ్గర కొన్నాళ్లు పని చేశాడు. అందులోనూ పవన్ ఈ వేడుకకు వస్తున్నాడు కాబట్టి త్రివిక్రమ్ ఆటోమేటిగ్గా హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News