పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా ఆడియో వేడుకలకు వస్తున్నారంటే చాలు అందరి చూపు ఆ సినిమాపైనే ఉంటుంది. తన కుటుంబ సభ్యుల వేడుకలకి తప్ప పెద్దగా స్టార్ హీరోల వేడుకలకు వెళ్లని పవన్ అప్పుడప్పుడు చిన్న తరహా హీరోల ఈవెంట్స్ కి వెళుతుంటారు. గతంలో సప్తగిరి వంటి కమెడియన్ హీరో సినిమాకు స్పెషల్ గెస్ట్ గా వెళ్లాడు. ఇక తన ఫ్యాన్ నితిన్ ఈవెంట్స్ కి వెళ్లడం అలవాటే ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సక్సెస్ మీట్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు మరో హీరో వేడుక కోసం కూడా పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లనున్నట్లు టాక్ వస్తోంది. రవి తేజ - నేల టిక్కెట్టు కు పవన్ ని పిలిచినట్లు టాక్. చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని తెలుపకపోనప్పటికి పవన్ ని స్పెషల్ గా ఇన్వైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కి రవి తేజకీ వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం ఉంది. కష్టపడి పైకొచ్చిన హీరో అని పవన్ కు రవితేజ పై ఒక సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. అంతే కాకుండా ఈ సినిమా ప్రొడ్యూసర్ కన్న బాబు గతంలో ప్రజారాజ్యం పార్టీ లో వర్క్ చేశాడు.
అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అతనికి చాలా క్లోజ్. దీంతో పవన్ ని కన్న బాబు కూడా స్పెషల్ గా పిలిచినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎవరి కోసం వస్తాడో చూడాలి. ప్రస్తుతం అయితే పవన్ జనసేన అసలు ప్రణాళికలు సిద్ధం చేసి ఆచరణలో పెడుతున్నాడు. మరి ఈ బిజీ షెడ్యూల్ లో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.