రంగస్థలం కోసం పవర్ స్టార్?

Update: 2017-09-25 04:40 GMT
మెగా మగధీరుడు ఓ వైపు కమర్షియల్ సినిమాలను చేస్తూనే మరో వైపు ప్రయోగాలకు కూడా సై అంటున్నాడు. ధృవ సినిమాతో కెరీర్లో మంచి బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ హిట్ పై కన్నేశాడు. ప్రయోగాత్మకంగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం1985 అనే సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి నెలలు కావొస్తున్నా.. దర్శకుడు చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఇంకా బయటపెట్టలేదు. రీసెంట్ అందుకోసం చిత్ర యూనిట్ తో కలిసి సినిమా ఫస్ట్ లుక్ ని ఫైనల్ చేశాడట సుకుమార్. చరణ్ కి కూడా నచ్చడంతో ఒకే చెప్పేశాడట. అయితే ఆ స్పెషల్ ఫస్ట్ లుక్ ని చరణ్ బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యణ్ చేతుల మీదుగా లాంచ్ చేయించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందని టాక్ వస్తోంది. రీసెంట్ గా దర్శకుడు సుకుమార్ అండ్ కథానాయకుడు చరణ్ కలిసి పవన్ ని కలిసారట. దీంతో పవన్ కూడా ఏ మాత్రం సందేహించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

అయితే పవన్ - చరణ్ కలుసుకుంటే ఒకసారి చూడాలని  అనుకుంటున్న అభిమానుల కోరిక నెరవేరతుందేమో. వీరిద్దరూ కలిసి చాలా రోజులైంది. ఇక ప్రస్తుతం రంగస్థలం చిత్ర యూనిట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ లో బిజీగా ఉంది. దసరా పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసేందుకు సన్నహకాలు చేస్తున్నారు. సినిమాలో చరణ్ కి జోడిగా సమంత నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Tags:    

Similar News