సినీనటుడు - జనసేన పార్టీ అధినేత మరోమారు ట్విట్టర్ లో స్పందించారు. అయితే ఈ దఫా ఆయన రజకీయాల గురించో లేకపోతే పెద్ద నోట్ల రద్దు వంటి సామాజిక అంశాల గురించి కాకుండా సినిమాల గురించి తన అభిప్రాయాన్ని పవన్ పంచుకున్నారు. ఇంతకీ దేని గురించి పవన్ స్పందించారు అనేదే కదా మీ సందేహం... ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దంగల్’ సినిమా గురించి పవర్ స్టార్ రియాక్టమయ్యారు.
ట్విట్టర్ తన అభిప్రాయాన్ని పంచుకున్న పవన్ దంగల్ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘దంగల్’ని చూశానని, చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకోకపోతే మనస్సాక్షి ఒప్పుకోదనిపించిందని పవన్ పేర్కొన్నారు. అద్భుతమైన జీవిత కథతో మంచి విజయం అందుకున్న ఆమిర్ ఖాన్ కు - ఆయన బృందానికి పవన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆమిర్ ఖాన్ చక్కని నటనతో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది హృదయాల్ని దోచుకున్నారని, అలాంటి నటుడు భారతదేశంలో ఉండటం దేశానికే గర్వకారణమని పవన్ ప్రశంసలు గుప్పించారు. దీంతో పాటుగా మిగిలిన బృంద సభ్యులను సైతం పవన్ ప్రశంసించారు. మనసుల్ని కదిలించేలా చిత్రాన్ని తీశారంటూ దర్శకుడు నితీశ్ తివారీ - ప్రధాన పాత్రలు పోషించిన ఫాతిమా సనా షేక్ - సన్యా మల్హోత్రా అభినందనీయులుని పేర్కొన్నారు. ‘దంగల్’ సినిమా మనమంతా మహిళా సాధికారిత దిశగా పనిచేయాలని విషయాన్ని గుర్తుచేసిందని పవన్ విశ్లేషించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/