2022 దేశంలో టాప్ 10 జాబితాలో ప‌వ‌న్- మ‌హేష్

Update: 2022-07-24 05:36 GMT
2022 సంవత్సరంలో ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త‌దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ టాప్ 10లో నిలిచింది. అలాగే మ‌హేష్ న‌టించిన‌ స‌ర్కార్ వారి పాట ఎనిమిదో స్థానంలో నిలిచింది. నంబ‌ర్ 1 స్థానంలో కేజీఎఫ్- నంబ‌ర్ 2 స్థానంలో ఆర్.ఆర్.ఆర్ రికార్డుల‌కెక్కాయి. ఈ ఏడాది అర్థ‌భాగం కంటే కొంత ఎక్కువ సమయం పూర్తయింది  బాక్సాఫీస్ వద్ద ఇప్ప‌టికి కొన్ని పెద్ద హిట్ లు ఉన్నా.. చాలా సినిమాలు అంచ‌నాల్ని అందుకోలేక‌ ఫ్లాప్ లతో నిరాశ‌ప‌రిచాయి.

992 కోట్ల షేర్ తో KGF 2 చాప్టర్ 2 - 902 కోట్ల షేర్ తో  RRR (1000 కోట్లు పైగా గ్రాస్ తో) వ‌రుస‌గా అగ్రస్థానంలో ఉన్నాయి. ఇవి రెండూ 2022లో దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన వాటిలో ఒక‌టి రెండు స్థానాల్లో ఉన్నాయి. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన‌ తమిళ భాషా చిత్రం `విక్ర‌మ్` భారతదేశంలో 300 కోట్లు వ‌సూళ్ల‌తో మూడో స్థానంలో నిలిచింది. కాశ్మీర్ ఫైల్స్ అసాధారణ కార‌ణాల‌తో మొదటి వారంలో అద్భుత‌ కలెక్షన్ లను అందించింది. సుదీర్ఘ కాలం ఈ మూవీ థియేటర్ల‌లో ఆడి చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించింది. ఓవ‌రాల్ గా 270కోట్లు పైగా వ‌సూలు చేసింది. భూల్ భులయ్యా 2 రూ.200 కోట్ల‌తో  ఐదవ స్థానంలో ఉంది. ఒక మంచి సినిమా చేస్తే పోస్ట్ కోవిడ్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌గ‌ల‌వ‌ని ఇవి నిరూపించాయి.

దాదాపు ప్రతి ప్రాంతంలో బాక్స్ ఆఫీస్ ఫుట్ ఫాల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఉత్తమ వ‌సూళ్ల‌ను అందించిన‌ ప్రాంతాలు తమిళనాడు - కేరళ. ఈ సంవత్సరంలో రెండు అతిపెద్ద సినిమాలు బీస్ట్ - వాలిమై త‌మిళ‌నాడులో సగటు వ‌సూళ్ల‌ను సాధించాయి. ఇవి ఇత‌ర భాష‌ల్లో ఫ్లాప్ లు అయినా స్వ‌భాష‌లో పెద్ద వ‌సూళ్ల‌తో స‌త్తా చాటాయి. అలాగే విక్రమ్- KGF చాప్టర్ 2- డాన్- RRR - KRK వంటి సినిమాలు తమిళనాడులో 2022 రెండవ త్రైమాసికంలో చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను రాబట్టాయి.

టాప్ 10లో లేక‌పోయినా కానీ.. భీష్మ పర్వం- 777 చార్లీ - జేమ్స్ వంటివి కేర‌ళ‌లో చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించాయి. పవన్ ఖింద్ (మరాఠీ)- సౌంకన్ సౌకనే (పంజాబీ) వంటి అనేక ప్రాంతీయ బ్లాక్ బస్టర్ లు ఉత్త‌మ‌ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి.

2022 సంవత్సరంలో భారతీయ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. KGF: చాప్టర్ 2 - రూ. 991.60 కోట్లు వ‌సూలు చేయ‌గా... RRR - రూ. 902.10 కోట్లు వ‌సూలు చేసింది. విక్రమ్ - రూ. సుమారు 307 కోట్లు ..కాశ్మీర్ ఫైల్స్ - రూ. 280.80 కోట్లు ..భూల్ భూలయ్యా 2 - రూ. 217.90 కోట్లు... బీస్ట్ - రూ. 169.40 కోట్లు ...మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ `డాక్టర్ స్ట్రేంజ్` - రూ. 161 కోట్లు సర్కారు వారి పాట - రూ. 155.60 కోట్లు ... గంగూబాయి కతియావాడి - రూ. 151.80 కోట్లు... భీమ్లా నాయక్ - రూ. 132.90 కోట్లు వ‌సూలు చేసాయి.

భారీ బ‌డ్జెట్లు అసాధార‌ణ బ‌డ్జెట్లు.. రిచ్ విజువ‌ల్ కంటెంట్ తో వ‌చ్చిన సినిమాలు పాన్ ఇండియా కేట‌గిరీలో గొప్ప ఆద‌ర‌ణ పొంద‌గా .. సాధార‌ణ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలుగా వ‌చ్చిన భీమ్లా నాయ‌క్- స‌ర్కార్ వారి పాట కూడా చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించాయి. ఇండియా టాప్ 10లో ప‌వ‌న్ - మ‌హేష్ ల‌ను నిల‌బెట్టాయి. ఈ విజ‌యాల‌ను స్టార్ డ‌మ్ కి నిర్వ‌చ‌నంగా చూడాలి.
Tags:    

Similar News