ఆగండి ఆగండి. ఇది 2007 నాటి వార్త. అప్పటికి ఇంకా హీరో అవ్వాలని కూడా అల్లు శిరీష్ కూడా అనుకుని ఉండడు. అయితే అప్పట్లో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో. ఇంతకీ ఇదంతా చెప్పాడో తెలుసుకోవాలని ఉందా.. లెటజ్ గో.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సెన్సిటివ్ పర్సన్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యనే ఒక ఫ్యాన్ చనిపోయినప్పుడు అతని ఇంటికి వెళ్ళి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే క్యాన్సర్ తో పీడించబడుతున్న చిన్నారులను కలిసినప్పుడు కూడా పవన్ కన్నీరు పెట్టుకున్నారు. అంతకంటే ముందు శిరీష్ విషయంలో కూడా ఇలాగే జరిగిందట. ''2007లో నాకు ఒక కార్ యాక్సిడెంట్ అయ్యింది. నన్ను ఐ.సి.యు.లో పెట్టారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారికి నాతో అంతగా పరిచయం లేకపోయినా కూడా.. నన్ను చూడ్డానికి వచ్చి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేను. అంతటి సెన్సిటివ్ మనిషి ఆయన'' అంటూ చెప్పాడు శిరీష్.
ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. అసలు పవన్ వ్యక్తిత్వం ఎటువంటిది అని చెప్పడానికి శిరీష్ ఇదంతా చెప్పుకొచ్చాడు.