ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదా?

Update: 2022-08-12 08:37 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ రీమేక్ ల‌తో ప్రేక్ష‌కుల ముదుకొచ్చారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా తెర‌కెక్కిన `వ‌కీల్ సాబ్‌` స‌క్సెస్ కావ‌డంతో ఆ త‌రువాత కూడా మ‌రో రీమేక్ నే ఆశ్ర‌యించాడు. అయితే ఈ సారి మ‌ల‌యాళ రీమేక్ ని ఎంచుకున్నారు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా తెలుగులో `భీమ్లా నాయ‌క్‌`గా రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ కూడా హిట్ అనిపించుకుంది.

అయితే ఈ మూవీ త‌రువాత కూడా త‌మిళ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేశారు. స‌ముద్ర‌ఖ‌ని న‌టించి తెర‌కెక్కించిన మూవీ `వినోదాయ సితం`. త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజ్ కాని ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుద‌లై విమర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. సూప‌ర్ హిట్ అనిపించుకుంది. `గోపాల గోపాల‌` త‌ర‌హా థీమ్ తో సాగే ఈ మూవీని తెలుగులో త్రివిక్ర‌మ్ చేత భారీ మార్పులు చేయించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో సారి దేవుడి పాత్ర‌లో న‌టించేందుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఇందులోని యంగ్ హీరో క్యారెక్ట‌ర్ లో సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌బోతున్నాడు. కృతిక శెట్టి హీరోయిన్ గా న‌టించ నుంద‌ని వార్త‌లు వినిపించాయి. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌పైకి రానున్న ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేశారు. లాంఛ‌నంగా సెట్స్ పైకి వెళ్ల‌డ‌మే త‌రువాయి.

అయితే ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అనారోగ్యానికి గుర‌య్యారు. తీవ్ర జ్వ‌రం రావ‌డంతో ఇంటికే ప‌రిమితం అయిపోయారు. ప‌వ‌న్ ని ప‌రీక్షించిన డాక్ట‌ర్లు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించ‌డంతో గ‌త కొన్ని రోజులుగా ప‌వ‌న్ విశ్రాంతి తీసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం జ్వ‌రం నుంచి కోలుకున్నా.. షూటింగ్ కోసం సెట్ లోకి అడుగు పెట్ట‌డానికి ఆయ‌న పూర్తిగా సిద్ధం కాలేద‌ని ఇంకా అనారోగ్యం నుంచితేరుకోలేద‌ని తెలుస్తోంది. ఆ కార‌ణంగానే `వినోదాయ సితం` షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంద‌ని చెబుతున్నారు. ఆగ‌స్టు లోనే `వినోదాయ సితం` రీమేక్ ని స్టార్ట్ చేయాల్సి వున్నా కొన్ని కారణాల వ‌ల్ల అది జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది.

ప‌వ‌న్ వినోదాయ సితం ని ప‌ట్టాలెక్కిస్తారా?  లేక ఆగుతూ సాగుతూ మ‌ధ్య‌లో మ‌ళ్లీ ఆగిన `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` షూటింగ్ ని తిరిగి ప్రారంభిస్తారా? అనే విష‌యంలో మాత్రం ఎలాంటి స్ప‌ష్ట‌త ల‌భించ‌డం లేదు. మ‌రో రెండు వారాలు ఆగితే కానీ ప‌వ‌న్ ఏం చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.
Tags:    

Similar News