ఫొటోటాక్ : అందాల పాయల్‌ సెట్స్ లో ప్రియుడితో లవ్వాట

Update: 2021-10-06 09:30 GMT
ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోయిన్ గా మంచి పేరును దక్కించుకున్న పాయల్‌ రాజ్‌ పూత్‌ టాలీవుడ్‌ లో పాతుకు పోయింది. స్టార్స్ తో ఆఫర్లు రాకున్నా కూడా వరుసగా పాయల్‌ రాజ్ పూత్‌ సినిమాలతో వెబ్‌ సిరీస్ లతో బిజీగా ఉంది. ఇదే సమయంలో ఈ అమ్మడు ఓపెనింగ్స్.. ఈవెంట్స్ తో కూడా బిజీగా ఉంటోంది. ఖాళీ సమయం దొరికితే ప్రియుడు సౌరవ్‌ డింగ్రాతో హాలీడేలకు వెళ్తోంది. సౌరవ్ డింగ్రా తో సుదీర్ఘ కాలం రిలేషన్ కోరుకుంటున్న ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి. కాని ఆమె నటిగా ప్రస్తుతం బిజీగా ఉంది. కనుక ఇప్పట్లో ఆ ఆలోచన చేయక పోవచ్చు అనేది ఆమె సన్నిహితుల మాట.

పెళ్లి చేసుకోకున్నా ఇద్దరు ప్రేమలో ఉన్నారు కనుక కలిసి ఉంటున్నారు. ఆమద్య కోవిడ్‌ తో సౌరబ్‌ తల్లి మృతి చెందారు. అప్పటి నుండి ఒంటరితనంతో బాధపడుతున్న అతడికి పాయల్ అండగా నిలిచింది. ఈ సమయంలో అతడికి మద్దతుగా నిలిచి అందులోనుండి బయటకు వచ్చేందుకు తనవంతు సహాయంను అందించింది. పాయల్‌ తో కలిసి చాలా నెలలుగా సౌరబ్‌ హైదరాబాద్ లో ఉంటున్నాడు. పాయల్‌ షూటింగ్ లకు అతడు వెళ్తూ స్నేహితుడి మాదిరిగా ఆమెకు అండగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం కిరాతకుడు అనే సినిమాలో పాయల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా చిత్రీకరణ లో ఉన్న పాయల్‌ తో పాటు సౌరబ్‌ కూడా ఉన్నాడు. అక్కడ షూటింగ్‌ గ్యాప్ లో సరదాగా ప్రకృతిని ఇద్దరు ఎంజాయ్‌ చేస్తున్నారు.

కిరాతకుడు సినిమా షూటింగ్ లో ఉన్న పాయల్‌ తో సౌరబ్ ఫొటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. పాయల్‌ తన ప్రేమ విషయాన్ని బాహాటంగా చెప్పేయడంతో విమర్శలు.. పుకార్లకు తావు లేకుండా అయ్యింది. సౌరబ్‌ తో ఉన్న సమయంలో పాయల్‌ చాలా ఆనందంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. నెట్టింట పాయల్‌ మరియు సౌరబ్ ఫొటోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఇక కిరాతకుడు సినిమా విషయానికి వస్తే ఆది సాయి కుమార్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు వీరభద్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాయల్‌ కు ఏ స్థాయిలో గుర్తింపు వస్తుంది అనేది చూడాలి.




Tags:    

Similar News