మైల్ స్టోన్ మార్కు దాటేసిన పెళ్లిచూపులు

Update: 2016-08-20 11:30 GMT
అమెరికా ప్రేక్షకుల టేస్టే వేరు. వాళ్లకు రామ్ చరణ్..నందమూరి బాలకృష్ణల కంటే కూడా నానినే పెద్ద స్టార్. ఆ పెద్ద హీరోల సినిమాల కంటే నాని చిత్రాలంటేనే వారికి ఆసక్తి. స్టార్ వాల్యూని చూడకుండా తమ టేస్టుకు తగ్గ సినిమాలకే పట్టం కడతారు అక్కడి ప్రేక్షకులు. ఈ మధ్య ‘పెళ్లిచూపులు’ అనే చిన్న సినిమా రిలీజైతే దానికి బ్రహ్మరథమే పట్టారు. తొలి రోజు నుంచే అనూహ్యమైన వసూళ్లు దక్కించుకున్న ఆ సినిమా ఇప్పుడు ఏకంగా మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టేసింది.

రెండో వారానికి 7 లక్షల డాలర్లకు పైగా కొల్లగొట్టిన ‘పెళ్లిచూపులు’ మిలియన్ క్లబ్బుకు దగ్గరగా వచ్చి కొంచెం స్లో అయింది. ఐతే ఎట్టకేలకు ఆ మార్కును అందుకుని చరిత్ర సృష్టించింది. మిలియన్ డాలర్ క్లబ్బులో చేరిన అత్యంత లో బడ్జెట్ మూవీ ఇదే. పెట్టుబడి-లాభం లెక్కల్లో చూస్తే అమెరికాతో అతి పెద్ద హిట్ ఇదే. పబ్లిసిటీ ఖర్చులతో కలిపి పెట్టిన పెట్టబడి మీద ఈ సినిమా 25 రెట్ల దాకా వసూలు చేసినట్లు అంచనా.

పెళ్లిచూపులు రిలీజయ్యాక వచ్చిన ఈ సినిమా కూడా దాని కలెక్షన్లపై ప్రభావం చూపలేకపోయింది. శ్రీరస్తు శుభమస్తు.. మనమంతా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా దాన్ని దాటలేకపోయాయి. ‘బాబు బంగారం’ విడుదల టైంలో మాత్రం ‘పెళ్లిచూపులు’ స్లో అయింది. ఆ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో మళ్లీ పుంజుకుంది. టికెట్ ధరలు పెంచి.. మరిన్ని సెంటర్లు యాడ్ చేయడంతో కలెక్షన్లు స్టడీగా సాగాయి.
Tags:    

Similar News