శాటిలైటే రెండింత‌ల లాభాలు తెచ్చిపెట్టింది

Update: 2016-08-07 04:13 GMT
అస‌లు సిస‌లు స‌క్సెస్‌ కి అర్థం చెప్పింది పెళ్లిచూపులు. ద‌మ్మున్న చిన్న సినిమా తీస్తే ఎలాంటి రిజ‌ల్ట్ ఉంటుందో మ‌రోసారి ఇండ‌స్ట్రీకి చాటి చెప్పింది. ఆ సినిమా తీసింది రూ: 75 ల‌క్ష‌ల్లో. శాటిలైట్ అమ్మితే  వ‌చ్చింది రూ: 2.35కోట్లు. అంటే రెండింత‌లు లాభాల‌న్న‌మాట‌. శాటిలైట్‌ లోనే ఇంతగా రాబ‌డి అందుకొన్న ఆ సినిమా ఇక బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ స్థాయిలో వ‌సూళ్లు సొంతం చేసుకొంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. సినిమా విడుద‌లై వారం గ‌డుస్తున్న‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్లు రోజు రోజుకీ పెరుగుతున్నాయే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. టేబుల్ ప్రాఫిట్‌ తో విడుద‌లైన ఆ  సినిమాకి చివ‌రిలోపు  క‌నీ విరుగ‌ని రేంజ్‌ లో లాభాలొస్తాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

సురేష్‌ బాబు నిర్మాత‌ల ద‌గ్గ‌ర్నుంచి ఔట్  రేట్‌ కి కొనేసి సినిమాని విడుద‌ల చేశాడు. ఆయ‌న‌కీ లాభాల పంట పండుతోంది. పెళ్ళిచూపులులో చెప్పుకోద‌గ్గ స్టార్లు ఎవ్వ‌రూ లేరు కాబ‌ట్టి మొద‌ట ఈసినిమాకి శాటిలైట్‌ లో పెద్ద‌గా డిమాండ్ రాలేదు. దీంతో నిర్మాత‌లు విడుద‌ల త‌ర్వాత అమ్మేయాల‌ని అనుకొన్నారు. తాజాగా  సినిమా ఘ‌న విజ‌యం దిశ‌గా దూసుకెళుతుండ‌టంతో టీవీ ఛాన‌ల్స్ శాటిలైట్ రైట్స్ కోసం ఎగ‌బడ్డాయి. జెమినీ ఛాన‌ల్ 2.35కోట్లు పెట్టి రైట్స్‌ని ద‌క్కించుకొన్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు  త‌రుణ్ భాస్క‌ర్‌ - హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ - హీరోయిన్ రీతూవ‌ర్మ స్టార్ స్టేట‌స్‌ ని అందుకొన్నారు. వాళ్ల‌ని వ‌రుసగా అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి.
Tags:    

Similar News