టాలీవుడ్ లో చిన్న సినిమా హవా బాగానే నడుస్తోంది. ఒకవైపు పెద్ద సినిమాలు నిరుత్సాహ పరుస్తున్న సమయంలో.. చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. చాలా చిన్న సినిమాగా మొదలై.. ఇప్పుడు విపరీతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ పెళ్లి చూపులు. రివ్యూల నుంచి రేటింగ్ ల వరకు అన్ని యాంగిల్స్ లోను పెళ్లి చూపులు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది.
ఈ మూవీలో చాలానే ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు అంటే.. సినిమా మీద కాదు. లో బడ్జెట్ మూవీ కావడంతో అందుకు తగ్గట్లుగా తెరకెక్కించేందుకు మొదటిసారిగా చేద్దాం అనే యాంగిల్ లో ట్రై చేశారు. పెళ్లిచూపులు చిత్రంలో నటించిన యాక్టర్స్.. టెక్నికల్ టీం అంతా తెలంగాణ వ్యక్తులే కావడం విశేషం. హీరో విజయ్ దేవరకొండ - హీరోయిన్ రితు వర్మ - దర్శకుడు తరుణ్ భాస్కర్ - మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ - కెమేరా మ్యాన్ సాగర్ తో పాటు నిర్మాత రాజ్ కందుకూరి కూడా తెలంగాణ వ్యక్తే.
ఇక ఆడియోని షూటింగ్ స్పాట్ లోనే సింక్ సౌండ్ సిస్టంతో రికార్డ్ చేశారు. క్లౌడ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ద్వారా పేపర్ వర్క్ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇవన్నీ సినిమా బడ్జెట్ ని గణనీయంగా తగ్గించేస్తాయి. పెళ్లి చూపులతో మొదలై పెళ్లి చూపులతో ఎండ్ అయ్యే ఈ కాన్సెప్ట్ కి ఆడియన్స్ నుంచి కూడా మంచి రిపోర్టులే వస్తున్నాయి.