స్టార్‌ హీరోయిన్‌.. గుండు కొట్టించుకుంది

Update: 2016-01-24 17:30 GMT
సినిమాలో పర్ ఫెక్ట్ లుక్ కోసం చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. ఒరిజినల్ గా లుక్ ఉండేలా చాలా ఎక్సర్ సైజులు, బాడీ బిల్డింగులు, మార్షల్ ఆర్ట్స్ నేర్చేసుకుంటూ ఉంటారు. కానీ ఓ సినిమా కోసం గుండు కొట్టించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా ఓ హీరోయిన్ ఇలా చేయడమంటే అది చాలా అంటే చాలా పెద్ద విషయం.

అఫ్ కోర్స్.. ఈ ఇన్సిడెంట్ ఇండియాలోది కాదులెండి. స్పెయిన్ నటి పెనెలోప్ క్రజ్ ఇలా గుండు చేయించేసుకుంది. ఓ విగ్గు పెట్టుకున్నా సరిపోయే పరిస్థితి ఉన్నా.. కమిట్ మెంట్ కోసం మొత్తం జుట్టును త్యాగం చేసేసింది. 'మా మా ' అనే మూవీలో యాక్ట్ చేస్తోంది పెనెలోప్. ఈ సినిమా కేన్సర్ పేషెంట్ అయిన ఓ మహిళపై నడిచే స్టోరీ. ఇందులో ఈమే ప్రధాన పాత్రధారి. కేన్సర్ తో పోరాడే వ్యక్తిగా అత్యంత సహజంగా కనిపించడం కోసం.. ఇలా గుండుతో దర్శనమిచ్చిందీ స్పానిష్ సుందరి. డోంట్‌ మూవ్‌ - వోల్వర్‌ - విక్కీ క్రిస్టీనా బార్సిలోనా - పైరేట్స్‌ ఆఫి కరేబియన్‌ః స్రేంజెర్స్‌ టైడ్‌... వంటి చిత్రాలతో ఈమె ప్రపంచానికి సుపరిచతం.

41 సంవత్సరాల వయసు ఉన్న ఈ భామ.. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పాత్ర ఇదే అని చెబుతోంది. రిస్క్ తీసుకోవడానికి తనకి ఇదే అత్యంత సమయం అంటోంది పెనెలోప్. గుండు చేయించుకున్నాక అందంగా ఉంటానా, ఛండాలంగా కనిపిస్తానా అని అలోచించలేదట. ప్రతీ మహిళా ఎదుర్కొంటున్న ఓ సమస్యను ఇతివృత్తంగా తీసుకుని చేస్తున్న మూవీ కావడంతో.. ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకు ఈ గుండు అంటోంది పెనెలోప్ క్రజ్.
Tags:    

Similar News