బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవలే నిక్ జోనస్ ను వివాహం చేసుకుని, కుటుంబ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. అంతా సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో ప్రియాంక చోప్రాపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ విమర్శలకు కారణం ఆమె తన పుట్టిన గడ్డపై దేశ భక్తిని చాటడం. అవును ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో జై హింద్ అంటూ పోస్ట్ చేయడంతో ఆమెపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
2016వ సంవత్సరంలో యూనిసెఫ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రియాంక చోప్రా నియమితురాలు అయ్యింది. యూనిసెఫ్ లో ఉన్న వారు ఏ దేశానికి మద్దతుగా మాట్లాడటం కాని, ఏ దేశం తరపున ప్రచారం చేయడం కాని చేయకూడదు. అన్ని దేశాలు సమాన దృష్టితో వారు చూడాలి. కాని తాజాగా పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రియాంక చోప్రా ఆర్మీ గొప్పదనంను తెలియజేస్తూ జై హింద్ అంటూ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ ప్రియాంక చోప్రాను చిక్కుల్లో పడేసింది.
ప్రియాంక చోప్రాను వెంటనే యూనిసెఫ్ నుండి తొలగించాలంటూ పాకిస్థాన్ తో పాటు పలు దేశాలకు చెందిన వారు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఇండియా వారు కూడా కొందరు ప్రియాంక చోప్రా యూనిసెఫ్ అంబాసిడర్ అయ్యి ఉండి అలా మాట్లాడటం యుద్దాని ప్రేరేపించడమే అంటూ విమర్శిస్తున్నారు. మరి తన జైహింద్ పోస్ట్ పై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి.