ఫోటో స్టోరి: ఇస్మార్ట్ కొంటె కోనంగి

Update: 2019-11-30 06:25 GMT
ఇస్మార్ట్ గాళ్ న‌భా న‌టేష్ స్పీడ్ చూస్తుంటే ఇప్ప‌ట్లో ఆప‌డం క‌ష్ట‌మే. 1000 సీసీ బుల్లెట్టులా ఎదురే లేకుండా దూసుకెళుతోంది. వ‌రుస‌గా ఒక‌దాని వెంట ఒక‌టిగా ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే సాటి నాయిక‌ల‌తో పోలిస్తే న‌భాలోనే ఎక్స్ ట్రా గ్రేసు ఇలా దూసుకెళ్లేందుకు సాయ‌మ‌వుతోంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆరంభం సుధీర్ బాబు స‌ర‌స‌న `న‌న్ను దోచుకుందువ‌టే` చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ న‌ట‌న‌లో త‌నదైన ముద్ర వేసింది. తాజాగా రామ్ స‌ర‌స‌న న‌టించిన‌ `ఇస్మార్ట్ శంక‌ర్` మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లింది. పూరి మార్క్ స్క్రిప్టుకి రామ్ ఎన‌ర్జీకి న‌భా మాస్ అప్పీల్ మ్యాచ్ అవ్వ‌డం ప్ల‌స్ అయ్యింది. ఇస్మార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ తో జూనియ‌ర్ ఇలియానా అంటూ అభిమానులు ముద్దుగా పిలిచేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న డిస్కో రాజా చిత్రంలో న‌టిస్తోంది. మంచు మ‌నోజ్ కొత్త బ్యాన‌ర్ లో తెర‌కెక్కించే చిత్రానికి న‌భా పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లొచ్చాయి. అలాగే ప‌లువురు న‌వ‌త‌రం హీరోల స‌ర‌స‌న ఈ అమ్మ‌డి పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని తెలుస్తోంది.

ఇక సోష‌ల్ మీడియాలో న‌భా స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో న‌భా అద‌ర‌గొడుతోంది. మ‌రోవైపు ప‌బ్లిక్ లోనూ ఈ అమ్మ‌డు అదే గ్రేస్ చూపిస్తోంది. తాజాగా విమానాశ్ర‌యంలోనూ అభిమానుల్ని క‌వ్విస్తూ కెమెరా కంటికి చిక్కింది. టాప్ టు బాట‌మ్ బ్లూ డెనిమ్ లో పిచ్చెక్కించింది. న‌భా కొంటె వేషాలు ప్ర‌స్తుతం కుర్ర‌కారు వాట్సాపుల్లో వైర‌ల్ గా మారాయి.
Tags:    

Similar News