ఫోటో స్టోరి: ఫ‌్రాకు లో వేడెక్కిస్తున్న టీనేజీ అందం

Update: 2019-11-16 11:43 GMT
కుచ్చుల ఫ్రాకులో వేడెక్కిస్తున్న ఈ అందగ‌త్తె ఎవ‌రు? .. అంటే పేరు సిమ్ర‌త్ కౌర్... ఊరు ముంబై. ఇంత‌కీ ఏ సినిమాల్లో న‌టించింది? అంటే.. పరిచయం  (2018).. ప్రేమ తో మీ కార్తీక్  (2017) అనే రెండు తెలుగు చిత్రాల్లో న‌టించింది. అయితే న‌టించిన రెండు సినిమాలు ఆశించినంత విజ‌యాలు సాధించ‌ లేదు.

దాంతో కొంత‌ కాలంగా తెర‌కు దూర‌మైంది. వాస్త‌వానికి ఈ అమ్మ‌డి గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది త‌క్కువే. కౌర్ అన్న పేరుకు త‌గ్గ‌ట్టే ఉత్త‌రాది అమ్మాయి కాబ‌ట్టి ఆ ఫ్లేవ‌ర్ టింజ్ బాడీ లాంగ్వేజ్ త‌న సొంతం. పైగా స్పోర్ట్స్ ఉమెన్ .. క్రీడ‌లు వ‌దిలి సినిమాల్లోకి వ‌చ్చింది. అయితే అలా ఎందుకు వ‌చ్చింది? అంటే సినిమా అంటే విప‌రీత‌మైన పిచ్చి అట‌. ఇంత‌కుముందు `ప‌రిచ‌యం` ఇంట‌ర్వ్యూ లోనూ .. ఎన్నో ఆస‌క్తి క‌ర సంగ‌తుల్ని రివీల్ చేసింది. ఒక క్రీడాకారిణి గా టామ్ బోయ్ గా ఉన్న త‌ను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అన్న‌ది అలా జ‌రిగి పోయింద‌ని త‌ల్లిదండ్రులు షాక్ తిన్నార‌ని చెప్పింది.

అయితే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ లో ప్ర‌వేశం ఎలా దొరికింది? అంటే.. ఇక్క‌డ ప్ర‌త్యేకించి ఒక పీఆర్వోని మ్యానేజ్ చేస్తోంద‌ట‌. మ‌ధ్య‌వ‌ర్తులు లేనిదే ఎక్క‌డా ఛాన్సులు రావు. ముంబై ప‌రిశ్ర‌మ అయినా హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ అయినా మ‌ధ్య‌లో ఒక‌రుండాలి! అంటూ పంచ్ వేసింది ఆ ఇంట‌ర్వ్యూ లో. ఇక ప్ర‌తి సినిమాని డెబ్యూ సినిమా గా భావించి న‌టిస్తాన‌ని చెప్పింది. అంతేకాదు ద‌ర్శ‌కుల‌ తో చాలా క్లోజ్ గా ఉంటాన‌ని క్లారిటీనిచ్చింది. లేటెస్టు గా ఇలా అదిరి పోయే ఫోటోషూట్ తో తిరిగి సోష‌ల్ మీడియాలో ట‌చ్ లోకి వ‌చ్చింది ఈ క‌ర్వీ డేరింగ్ బ్యూటీ. కుచ్చుల ఫ్రాకులో ఈ అమ్మ‌డు కుర్రాళ్ల‌ గుండెల్లో గుచ్చేస్తోంది. ముంబై ప‌రిశ్ర‌మ‌ కు వెళ్లే ముందు హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌పైనే ఎక్కువ కాన్స‌న్ ట్రేట్ చేస్తోంది. అందుకే ఈ పాట్లు.


Tags:    

Similar News