ఫోటో స్టోరీ : హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న రత్తాలు..!

Update: 2023-01-04 07:09 GMT
కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నీలి కళ్ల సుందరి రాయ్ లక్ష్మి తెలుగులో హీరోయిన్ గా కన్నా సైడ్ రోల్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత తెచ్చుకుంది. ఆ తర్వాత ఛాన్స్ లు వస్తున్నాయి కదా అని స్పెషల్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. రాయ్ లక్ష్మి స్పెషల్ ఐటం సాంగ్ చేసింది అంటే అది నిజంగానే స్పెషల్ గా ఉండాల్సిందే. తెలుగు, తమిళ భాషల్లో నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది.

ఆ తన గ్లామర్ డోస్ పెంచి బీ టౌన్ ఆడియన్స్ ని బుట్టలో వేయాలని అనుకున్న అమ్మడి ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా సరే అక్కడ సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు. హిందీలో వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ అడపాదడపా తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుంది రాయ్ లక్ష్మి. అంతేకాదు తన ఫోటో షూట్స్ తో కూడా ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల భామల ఫోటో షూట్స్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ క్రమంలో రాయ్ లక్ష్మి కి ఈ ఫోటో షూట్స్ మంచి మైలేజ్ వచ్చేలా చేస్తున్నాయి. లేటెస్ట్ గా బీచ్ లో బికినీ షోతో బెంబేలెత్తిస్తోంది రత్తాలు. బ్లూ కలర్ జాకెట్.. బ్లాక్ గాగుల్స్.. తొడలు కనిపించేలా ఒక క్లాత్ చుట్టుకుని అమ్మడు అందాల రచ్చ చేస్తుంది. న్యూ ఇయర్ ఎంజాయ్ మెంట్ లో భాగంగా అమ్మడు ఇలా తన ఫోటో షూట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.

సరిగా దృష్టి పెడితే స్టార్ రేంజ్ కి వెళ్లే మెటీరియల్ ఆమెది కాని అందరికి అన్ని విధాలుగా లక్ కలిసి రాదు కదా. అలా అనుకునే వచ్చిన ఛాన్స్ లనే చేస్తూ ఫ్రీ టైం లో ఇలా ఫోటో షూట్స్ తో టైం పాస్ చేస్తుంది రాయ్ లక్ష్మి. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా సౌత్ లోనే ఆమెకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. తన ఫోటో షూట్స్ తో సౌత్ ఫాలోవర్స్ ని మరింత ఆకట్టుకుంటుంది రాయ్ లక్ష్మి. హిందీలో ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న రాయ్ లక్ష్మి తెలుగు, తమిళ భాషల్లో ప్రజెంట్ అవకాశాలు లేవని తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News