ఫోటో టాక్: ఆ కిల్ల‌ర్ చూపేంటి క‌ళావ‌తి?

Update: 2022-05-10 10:30 GMT
కీర్తి సురేష్ అలియాస్ క‌ళావ‌తి క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో న‌టించిన సినిమాలు త‌క్కువే అయినా ఫాలోయింగ్ లో క‌ళావ‌తి క్రేజ్ ప్ర‌త్యేక‌మైన‌ది. అందుకే సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న న‌టించే అరుదైన అవ‌కాశాన్ని అందుకోగ‌ల్గింది. త‌న‌దైన శైలి వాక్చుర్యంతో హీరోల్ని ఆక‌ట్టుకోగ‌ల నేర్ప‌రి.  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి త‌న సినిమా వేదికపై నాటు నాటు స్టెప్ వేయించిందంటే క‌ళావ‌తి ఎంత ప్ర‌త్యేక‌మో తెలుస్తోంది. చెర్రీతో పాటు కీర్తి క‌లిసి డాన్సు చేసి ఆక‌ట్టుకుంది.

ఇలా చ‌ర‌ణ్ ని స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకున్న ఏకైక హీరోయిన్ కీర్తి. ఇక కెరీర్ విష‌యానికి వ‌స్తే  న‌టిగా త‌న‌కంటూ కొన్ని ప‌రిమితుల  విధించుకుని ముందుకు సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రేసులో వెనుక‌బ‌డినా త‌న ఇమేజ్ కి ఏమాత్రం డ్యామేజ్ లేదు. అదే ఛ‌రిష్మాతో ముందుకు సాగుతుంది.  సోష‌ల్ మీడియా వంటి మాధ్య‌మాల్లో కీర్తి గ్లామ‌ర్ ఎలివేష‌న్స్  అంటూ  పెద్ద‌గా  ఏమీ ఉండ‌వు.

ఉన్నా అవి ప‌రిమితంగా  సంప్ర‌దాయంగా ఉంటాయి. తాజాగా కీర్తి సారీ ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. అందులో కీర్తి క్రీమ్ క‌ల‌ర్ పలుచ‌ని  మెరుపుల‌ డిజైన‌ర్ సారీలో క‌నిపిస్తుంది.

బోట‌మ్ టూ నెక్ వ‌ర‌కూ మ‌నోహారంగా క‌నిపిస్తున్నా..ఆపై ముఖం మాత్రం మొత్తం సిస్ట‌మ్ నే ఛేంజ్ చేసింది. క‌ళ్ల‌లో గ్లోస్ నెస్.. అందమైన ఐబ్రోస్ న‌డుమ కిల్ల‌ర్ లుక్ లాక్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఇక కెరీర్ పరంగా చాలా కాలంగా ఒక బంపర్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది కీర్తి సురేష్. అది కూడా సూపర్ స్టార్ల సరసన నటించిన సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తోంది. కానీ ఆ రోజు ఇంతవరకూ రాలేదు. గడిచిన రెండేళ్లలో సరైన హిట్టు లేదు. అందుకే ఇప్పుడు కీర్తి ఆశలన్నీ సర్కార్ వారి పైనే. మహేష్ తనకు లక్కీ ఛామ్ గా మారతాడని ఎంతో ఆశిస్తోంది.

సర్కార్ వారి పాట భారీ బడ్జెట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ కి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించిందని ఇటీవల విడుదలైన ట్రైలర్ చెబుతోంది. మ‌రి సినిమాలో కళావ‌తి ఏ రేంజ్ లో ఆక‌ట్టుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News