ఫోటో స్టోరీ: జాక్వెలిన్.. జిల్ జిల్ పోజు

Update: 2019-11-13 06:20 GMT
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు యూత్ లో క్రేజ్ ఎక్కువే.  సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. జాక్వెలిన్ ఇన్స్టా ఖాతాకు 34 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటే మనం జాక్వెలిన్ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేసే ఈ భామ ఈమధ్యే 'సాహో' లో బ్యాడ్ బాయ్ సాంగ్ కు ప్రభాస్ తో కలిసి స్టెప్స్ వేసి తెలుగు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు సాధించింది.

తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలకు 'ఫీల్స్' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో బ్లాక్ కలర్ షార్ట్ గౌన్ ధరించి విండో దగ్గర నిలుచుని ఒక పర్ఫెక్ట్ డ్యాన్స్ పోజు ఇచ్చింది. స్లీవ్స్ దగ్గర వైట్ కలర్ ఫర్ ఉండడంతో డ్రెస్ చాలా అందంగా కనిపిస్తోంది. జాక్వెలిన్ డ్యాన్స్ పోజు కూడా  సూపరే.. హై హీల్స్ ధరించి ఒక కాలుపై నిలుచుని..రెండో కాలును పైకెత్తింది.. రెండు చేతులను గోడకు ఆన్చి పైకి చూస్తోంది. సడెన్ గా చూస్తే  ఇదో పెయింటింగ్ లాగా కనిపిస్తోంది.  ఇక జాక్వెలిన్ స్కిన్ టోన్.. కాళ్ళ అందాలు చూస్తే ఎవరైనా ఫ్లాట్ కావాల్సిందే.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి సూపర్ కామెంట్స్ వచ్చాయి.  "ఆర్టిస్టిక్ డ్యాన్స్ పోజ్".. "ఫ్యాబులస్ జాక్".. "ఏక్ దమ్ కడక్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.  ఈ ఫోటోలకు ఎల్లి అవ్రామ్.. టైగర్ ష్రాఫ్.. ఊర్వశి రౌతేలా.. సోఫీ చౌదరి లాంటి సెలబ్రిటీలు కూడా లైక్స్ కొట్టారు.  సినిమాల విషయానికి వస్తే జాక్వెలిన్ నటించిన చివరి చిత్రం 'డ్రైవ్' ను థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో ఈమధ్యే రిలీజ్ చేశారు.  'డ్రైవ్' తర్వాత జాక్వెలిన్  కొత్త సినిమాలేవీ సైన్ చెయ్యలేదు.
Tags:    

Similar News