ఫొటోటాక్ : మన మిస్ వరల్డ్‌ అందాల అరాచకం

Update: 2022-11-22 11:30 GMT
2017 సంవత్సరంలో మిస్‌ వరల్డ్ గా నిలిచిన మానుషి చిల్లర్ ఈ ఏడాది సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా నటిగా మానుషి చిల్లర్ కు మంచి భవిష్యత్తు ఉంది అంటూ చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ అమ్మడు రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ గా ముందు ముందు ఈ అమ్మడు మరిన్ని సినిమాలు చేయబోతున్నట్లుగా ఆమె లైనప్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.

హీరోయిన్ గా మానుషి చిల్లర్‌ చేస్తున్న సినిమాలతో పాటు ఆమె సోషల్‌ మీడియా ఫొటో షూట్స్ కూడా ఆమె యొక్క క్రేజ్ ను పెంచుతూ ఉన్నాయి. అందాల విందు చేస్తూ ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఇలా క్లీ వేజ్‌ షో చేస్తూ మానుషి చిల్లర్‌ చేసిన ఫొటో షూట్‌ ప్రతి ఒక్కరిని కూడా వావ్‌ అనేలా చేస్తున్నాయి. అందాల విందు చేస్తున్న ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ముందు ముందు ఈ అమ్మడు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంటుందనే నమ్మకంను కొందరు ఈ ఫొటోలు చూసి వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News