కరోనా పాండమిక్ తర్వాత సినిమాలకు ఆదరణ లభించడంతో మేకర్స్ అందరూ వరుసపెట్టి కొత్త సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ హీరో కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మనం కూడా ఒక కర్చీఫ్ వేసి పెడితే పోయేదేముంది అన్నట్లు ఏమీ ఆలోచించుకోకుండా విడుదల తేదీలను ప్రకటించారు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ రిలీజ్ డేట్లు మీద కర్చీఫ్ లు వేసుకున్న వారి ప్లాన్స్ ని అల్లకల్లోలం చేసేసింది.
కోవిడ్ రోజురోజుకీ విజృంభిస్తుండటంతో ఇప్పటికే చాలా సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. అయితే ఏప్రిల్, మే నెలల్లో విడుదల అవ్వాల్సిన నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు.. రెండు క్రేజీ సినిమాలు ఇప్పుడు ఎప్పుడు విడుదల చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి జూలై లేదా ఆగస్ట్ వరకు ఉంటుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇది గనుక జరిగితే మళ్లీ టాలీవుడ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది.
మహమ్మారి వైరస్ కారణంగా గతేడాది సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. దీని నుంచి కోలుకోడానికి చాలా సమయమే పట్టింది. ఇప్పుడు మళ్ళీ అవే పరిస్థితులు పునరావృతం అయితే మాత్రం తెలుగు సినిమా కోలుకోవడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. థియేటర్ వ్యవస్థ ఇంకా క్షీణించే అవకాశం ఉందని సినీ పెద్దలు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపున ఓటీటీల ప్రాధాన్యత ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయో చూడాలి.