ఇద్దరు రాణులు.. ఒకే సుందరి

Update: 2018-01-30 02:30 GMT
సౌత్ లో ఒక సినిమా ఒకే టైంలో నాలుగు భాషల్లో.. నలుగురు హీరోయిన్లతో తెరకెక్కడం అరుదనే చెప్పాలి. ఆ క్రెడిట్ క్వీన్ సినిమా రీమేక్ కు దక్కింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు - తమిళం - మళయాళం - కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో ఒకో భాషలో ఒక్కో హీరోయిన్ నటిస్తోంది. బాలీవుడ్ సింగర్ అండ్ మోడల్ శిబాని దండేకర్ ఇందులో ఇద్దరు క్వీన్లతో కలిసి నటించబోతోంది.

క్వీన్ ఒరిజినల్ వెర్షన్ లో లీసా హేడెన్ లో నటించిన పాత్రలో తెలుగు - మళయాళం భాషల్లో శిబాని నటించబోతోంది. తొలిసారి సౌత్ లో అడుగు పెట్టడమే కాకుండా ఒకేపాత్ర రెండు భాషల్లో నటించే అవకాశం వచ్చిందని ఈ సొగసరి ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. ‘‘నాకు ఛాలెంజింగ్ గా ఉండే రోల్స్ చేయడమంటే చాలా ఇష్టం. అలాంటిది ఒకే పాత్ర ఒకే టైంలో రెండు భాషల్లో చేయమని ఈ సినిమా మేకర్లు అడిగే సరికి భలే ఎక్సైటింగ్ గా అనిపించింది. అందుకే ఆలోచించకుండా ఎస్ అనేశాను. తెలుగు వరకు పెద్ద కష్టం అనిపించలేదు. మళయాళం పలకడం మాత్రం కష్టంగానే ఉంది. నా పాత్ర షూటింగ్ అంతా ఫ్రాన్స్ లో జరిగింది. అక్కడ తెలుగు తమిళం మళయాళం ఫ్రెంచి హిందీ ఇలా ఒకేసారి రకరకాల భాషలు వినిపించాయి. అప్పుడప్పుడు కాస్త చిత్రంగా అనిపించినా షూటింగ్ బాగా ఎంజాయ్ చేశా’’ అని చెప్పుకొచ్చింది శిబాని దండేకర్.

క్వీన్ తెలుగు వెర్షన్ లో హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా.. మళయాళ వెర్షన్ లో సాహసం శ్వాసగా సాగిపో ఫేం మంజిమా మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలను మిస్సమ్మడైరెక్టర్ నీలకంఠ డైరెక్ట్ చేస్తున్నాడు.
Tags:    

Similar News