ఇప్పుడు బయోపిక్ ల సీజన్. ఇప్పటివరకు వచ్చిన అన్నీ మూవీస్ దాదాపుగా మంచి విజయాలు సాధించే సరికి అందరూ బయోపిక్ లపై పడ్డారు. మన దగ్గర ఎన్టీఆర్ - వైఎస్ ఆర్ బయోపిక్ లు ఇప్పుడు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. అలాగే హిందీలో మన్మోహన్ సింగ్ బయోపిక్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి టైమ్ లో ప్రధాని నరేంద్రమోదీపై ఒక బయోపిక్ రాబోతుంది. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా. వివేక్ ఓబరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు పీఎం నరేంద్రమోదీ అనే పేరు పెట్టారు. దేశభక్తే నా శక్తి అనేది ట్యాగ్ లైన్.
అసలే ఎన్నికల సీజన్. ఇలాంటి టైమ్ లో బయోపిక్ లు వస్తే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ అంశాన్నే దృష్టిలో పెట్టుకునే బయోపిక్ లు మొత్తం ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మన్మోహన్ సింగ్ - బాల్ థాక్రేపై సినిమాలు సిద్ధమైపోయాయి. అయితే.. అవన్నీ కేవలం ఒకటో రెండో భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. కానీ ప్రధాని నరేంద్రమోదీ అందరికి తెలుసు. ఆయన గురించి తెలుసుకోవాలనే తపన అందరికి ఉంటుంది. అందుకే పీఎం నరేంద్రమోదీ సినిమాను మొత్తం 23 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే.. భారతదేశంలో ప్రతీ మూల ఈ సినిమా రిలీజ్ కాబోతుందన్నమాట. మేరీ కోమ్ - సరబ్ జిత్ లాంటి సమకాలీన అంశాలనే ప్రధాన కథాంశాలుగా తీసుకుని సినిమాలు తీసే ఒమంగ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. మోదీ చిన్నతనం నుంచి ప్రధాని అయ్యేవరకు జరిగిన విషయాలన్నింటిని ఈ సినిమాలో పొందు పర్చినట్లు దర్శకుడు చెప్పాడు. మరి.. పీఎం నరేంద్రమోదీ సినిమా ఎంతవరకు ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తుందో తెలియాలంటే.. మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
Full View