మరోసారి మెగాస్టార్ సినిమాలో మహాకవి పద్యాలు!

Update: 2021-06-23 08:30 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తన లేటెస్ట్ మూవీ ఆచార్యను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. అందుకే సినిమాకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ తో పాటు మాస్ కమర్షియల్ హంగులు కూడా అద్దుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా సిద్ధ అనే నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరు - రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే అన్ని హంగులతో పాటు కొరటాల నక్సలైట్ నేపథ్యంలో ఉండబోతుంది కాబట్టి తెలుగు విప్లవత్మాక రచయిత మహాకవి శ్రీశ్రీ రాసిన 'నేను సైతం' పద్యాలను కూడా వినిపించనున్నట్లు తెలుస్తుంది. మరి ఇదివరకు మెగాస్టార్ ఏయే సినిమాల్లో శ్రీశ్రీ పద్యాలు ఉపయోగించాడో ఆ సినిమాలు నేషనల్ అవార్డులతో పాటు భారీ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఆచార్యలో కూడా శ్రీశ్రీ పదాలు వినిపిస్తాయని తెలిసే సరికి అభిమానులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ ఎండోర్స్ మెంట్ అధికారిగా కనిపిస్తాడని ఆచార్య టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

అయితే ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో 152వది కావడంతో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాఓ మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ సెకండ్ టైం హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రాంచరణ్ జోడిగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే నటిస్తోంది. మరి ఆల్రెడీ చివరి దశలో ఉన్నటువంటి ఈ సినిమా షూటింగ్ జులైలో కంప్లీట్ చేయనున్నారు మేకర్స్. దాదాపు చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ - మణిశర్మ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం సినిమా పై ఆల్రెడీ చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ - కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Tags:    

Similar News