కళాభవన్ మణి బాడీలో విషం ఉంది

Update: 2016-05-29 11:02 GMT
మలయాళ నటుడు కళాభవన్ మణి మృతికి సంబందించిన కేసులో మిస్టరీ కొనసాగుతోంది. ఆయన విష ప్రయోగం వల్లే చనిపోయారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అనుమానాలుండగా.. హైదరబాద్ కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్ ఎస్ ఎల్) నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైన వివరాలతో అనుమానాలు మరింత బలపడ్డాయి. మణి శరీరంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ (మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఐతే మిథైల్ ఆల్కహాల్ శాతం ఎంత ఉంది.. అది మణి మరణానికి ఎంత వరకు కారణమైంది అన్నది తెలియాల్సి ఉంది.

ఐతే కళాభవన్ మణి ఒంట్లో పురుగు మందుల అవశేషాలు లేవని తేల్చింది. ఈ నివేదికపై మరింత స్పష్టత కోసం కేరళ పోలీసులు సీఎఫ్ ఎస్ ఎల్ కు రాబోతున్నారు. ఇంతకుముందు మణి బాడీని పరిశీలించిన కొచ్చిలోని ఓ రసాయన పరీక్షా కేంద్రం.. అందులో క్రిమి సంహారక మందు ‘క్లోర్ పిరిఫొస్’ అవశేషాలున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ అలాంటిదేమీ లేదని అంటోంది. తెలుగులో ‘జెమిని’ లాంటి సినిమాలతో పాపులర్ అయిన కళాభవణి మణి దక్షిణాదిన అన్ని భాషల్లో కలిపి 200కు పైగా సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది మార్చి 6న అతను హఠాత్తుగా మరణించాడు. ముందు అనారోగ్యం వల్ల చనిపోయాడని అనుకున్నా.. తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందినట్లు వెల్లడైంది.
Tags:    

Similar News