భారీ తారాగణంతో తన దశాబ్దాల కలను నిజం చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. భారీ బడ్జెట్ ఒక ఎత్తు అయితే.. సంక్లిష్టంగా ఉండే కథను.. అరటిపండు వొలిచి నోట్లో పెట్టిన చందంగా చాలా సింఫుల్ గా కథను చెప్పే ప్రయత్నం సక్సెస్ అయ్యింది. విడుదల వేళ.. కాస్తంత మిక్సైడ్ టాక్ వచ్చినప్పటికీ.. మణి కష్టం వేస్టు కాలేదు. నెగిటివ్ ప్రచారాన్ని బద్ధలు కొట్టేసి.. భారీ కలెక్షన్లను సొంతం చేసుకున్న క్లిష్టమైన రికార్డును సొంతం చేసుకుంది పొన్నియిన్ సెల్వం-1.
దాదాపు వెయ్యి ఏళ్ల క్రితం జరిగిన చోళ రాజుల చరిత్రను తెరకెక్కించిన మణిరత్నం చాలా సాహసమే చేశారు. సెప్టెంబరు 30న తమిళం.. తెలుగు.. హిందీ.. కన్నడ.. మళయాళ భాషలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీగా విడుదలైన ఈ మూవీ అందుకు తగ్గట్లే భారీ కలెక్షన్లను సాధించింది. తాజాగా ఈ మూవీ ఇటీవల కాలంలో సూపర్ సక్సైస్ అయిన కశ్మీర్ ఫైల్స్ మూవీ వసూళ్లను అధిగమించింది.
ఈ మూవీ విడుదలైన తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.355 కోట్ల వసూళ్లను దాటినట్లు చెబుతున్నారు. కశ్మీర్ ఫైల్స్ మూవీ రూ.340 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకోగా.. తాజాగా ఆ రికార్డును సైతం అధిగమించేసింది. ఈ మూవీకి అంతకంతకూ పెరుగుతున్న మౌత్ పబ్లిసిటీ సినిమా కలెక్షన్లను మరింత పెరిగేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు.
దసరాకు ప్రతి భాషలోనూ కొన్ని సినిమాలు విడుదల కావటం.. సినిమాకు మొదట్లో నెగిటివ్ ప్రచారం జరగటంతో వసూళ్ల వేగం అనుకున్నంతగా లేదు. అయితే.. కాస్త నిదానంగా మొదలైన బజ్.. అంతకంతకూ విస్తరిస్తూ.. ఈ సినిమాను చూస్తున్నారు.
ఈ కారణంతోనే మరో వారం పొన్నియిన్ సెల్వం 1 వసూళ్ల పర్వం సాగుతుందని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం.. బిజినెస్ క్లోజ్ అయ్యే నాటికి రూ.500 కోట్ల మార్కు దగ్గర ఆగటం ఖాయమంటున్నారు. మణి సార్ కలకు ఆ మాత్రం వసూళ్లు రాకపోతే ఏం బాగుంటుంది చెప్పండి?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.