బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి ఎప్పుడూ సై అంటుంది ముంబై బ్యూటీ పూజా హెగ్డే. అది మాల్దీవులు అయినా.. గోవా అయినా.. ఎగ్జోటిక్ డెస్టినేషన్ ని ఎంపిక చేసుకుని విహారయాత్రలకు వెళుతుంటుంది. ఇప్పుడు కూడా మండే ఎండల నుంచి దూరంగా సేద దీరేందుకు బీచ్ విహారయాత్రకు వెళ్లింది. తెల్లని ఇసుక బీచ్ లో సరాగాలు పలికించింది. అక్కడ బికినీలో పూజా బోలెడంత సందడి చేసిందని తాజా ఫోటోగ్రాఫ్ వెల్లడిస్తోంది.
బీచ్ విహారంలో ఓ కొత్తసంగతిని చూడా చెప్పింది పూజా. తెల్లని ఇసుక బీచ్ లో ఎంతో ఉల్లాసంగా షర్బత్ సేవిస్తున్నానని పూజా తెలిపింది. బ్లూ బికినీలో జాయ్ ఫుల్ గా కనిపిస్తున్న పూజా భారీ హ్యాట్ ని ధరించింది. అంతేకాదు ఇది త్రోబ్యాక్ అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే పూజా నటించిన భారీ చిత్రాలు ఇటీవల బ్యాక్ టు బ్యాక్ విడుదలైన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ - బీస్ట్- ఆచార్య లాంటి భారీ చిత్రాలు ఫ్లాపులవ్వడం తనని నిరాశపరిచింది. ప్రస్తుతం సల్మాన్ భాయ్ సరసన ఒక చిత్రంలో నటిస్తోంది.
ప్రభాస్- విజయ్- చరణ్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు ఊహించని ఫలితాన్ని అందించాయి. ఇంతలోనే ఈ భామ టాలీవుడ్ లో ఒక పెద్ద ఆఫర్ ని పోగొట్టుకుందని గుసగుస వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్' వాయిదా పడిన తరువాత ఈ చిత్రంలో కథానాయికగా నటించాల్సిన పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం.
పరిశ్రమ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. పూజా ఇతర దర్శకులతో తన కమిట్ మెంట్ ల కారణంగా పవన్ కళ్యాణ్ చిత్రం నుండి తప్పుకుంది. భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ మరింత ఆలస్యం కావడంతో ఆమె తన డేట్ లను సర్దుబాటు చేయలేకపోయింది.పూజాకి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లు ఉన్నా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇంతలోనే మరో మెగా ఆఫర్ ని కోల్పోవాల్సి రావడం తనకు ఒక రకంగా టాలీవుడ్ లో మైనస్ అని చెప్పాలి.
పూజా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో తన తదుపరి చిత్రం కభీ ఈద్ కబీ దీపావళి చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుతో కలిసి ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్ ను చేస్తోంది. ఈ రెండిటిపైనా ఇక తన హోప్స్ అన్నీ. ఇక పూజా స్కిప్ కొట్టిన భవదీయుడు భగత్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరి హర వీర మల్లు' షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం ఈ మూవీకి ఇబ్బందికరంగా మారింది. దీనివల్లనే భవధీయుడు నుంచి పూజా తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం.