స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈమెకు తెలుగులో మాత్రమే కాదు... తమిళ, హిందీ భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. దక్షిణాది, ఉత్తరాది భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. అటు వెండితెరపై ఇటు సోషల్ మీడియాలో అందాలని ఆరబోస్తూ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అబ్బాయిల కలల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఆమె ఏ పోస్ట్ పెట్టిన అది ఇట్టే వైరల్ అవుతుంది.
అయితే పూజా హెగ్డే కి ఒక సోదరుడు ఉన్న సంగతి తెలిసిందే. అతని పేరు రిషబ్ హెగ్డే. ఇతను ముంబైలో చాలా ఫేమస్ డాక్టర్. గతేడాది అక్టోబర్ 16న బెంగళూరులో ఇతనికి శివాని అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే తాజాగా నేడు వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఇక జనవరి 27న రిషబ్ – శివాని ల పెళ్లికి వైభవంగా చేశారు. మెహందీ, సంగీత్ సెలబ్రేషన్స్ అంటూ మూడు రోజుల పాటు రిషబ్ – శివానీ ల పెళ్లి బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇప్పుడా వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పూజా ట్రెడిషనల్ గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇది చూసిన అభిమానులు పూజ వెరీ క్యూట్, ట్రెడిషనల్ గా ఎంత అందంగా ఉందో అంటూ పూజ హెగ్డే తో పాటు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీ పెళ్లి ఎప్పుడూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం పూజా బాలీవుడ్‌లోనూ తన హవా చాటుతోంది. తాజాగా ఈ అమ్మడు సర్కస్ సినిమాలో మెరిసింది. అలాగే బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్‌ఖాన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ లో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇంకా తెలుగులో పవన్ కల్యాణ్‌కు జోడీగా భవదీయుడు భగత్‌సింగ్ సినిమాలోనూ కనిపించనుంది. ఇది కాకుండా గత కొద్ది రోజులుగా తెలుగులో నాగార్జున సరసన ఆమె సినిమా చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున హీరోగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులొ పూజ నటించబోతుందని ప్రచారం సాగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.