కళ్లతో కోటిభావాలు పలికించే కథానాయికలు మనకు ఎందరున్నారు? ఎక్స్ ప్రెషన్ పలికించేందుకు అందమైన ముఖారవిందం ఉంటే సరిపోతుందా? పాత్రకు తగ్గట్టు ముఖకవలికల్ని మార్చాలి. కళ్లతోనే బోలెడన్ని భావాల్ని పలికించగలగాలి. నవ్వే నవ్వు.. మూతి బిగింపు.. వాకింగ్ స్టైల్ ప్రతిదీ సంథింగ్ స్పెషల్ అన్న టాక్ రావాలి. ఏదో ఇలా వచ్చి అలా నాలుగైదు క్యాట్ వాక్ లు చేసి.. నడుము ఒంపులు చూపించి ఎక్స్ పోజింగుతో ఆకట్టుకుని నేను కూడా నటిని అయిపోయాను! అంటే ఎవరినా అంగీకరిస్తారా?
ఈ తరహాలోనే ముంబై.. బెంగళూరు క్యాట్ వాక్ భామలు తమను తాము సావిత్రి.. భానుప్రియ.. జయప్రద .. శ్రీదేవి రేంజు అని ఫీలైపోతున్నట్టే కనిపిస్తోంది. కేవలం నాలుగైదేళ్లలోనే నాలుగు కోట్లు అందుకునే రేంజుకు ఎదిగేస్తే అగ్ర కథానాయిక అయిపోయినట్టేనా? అంటే ప్చ్! అని పెదవి విరిచేస్తున్నారు. అయితే ఇటీవల టాలీవుడ్ లో పాపులరైన కన్నడిగ పూజా హెగ్దే అంతే ఇదిగా ఫీలైపోతోందట. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లోనూ ఆరంభమే బెడిసికొట్టింది. తెలుగులో ముకుంద ఫెయిల్..బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మోహజందారో! అంతకన్నా ఘోరమైన ఫలితాన్నిచ్చింది. దీంతో ఏ బాలీవుడ్ దర్శక నిర్మాత అమ్మడి వైపు చూసింది లేదు. ఇదే సమయంలో సొగసరిని టాలీవుడ్ ఆదుకుంది. అందం.. మంచి ఎత్తు ఇక్కడ అవకాశాలు తెచ్చిపెట్టింది. అయినా అవకాశాలైతే అందుకుంది గానీ 2018 వరకూ చెప్పుకోదగ్గ సక్సెస్ ఒక్కటైనా ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఇదే సమయంలో అరవింద సమేత..మహర్షిలో ఛాన్సులు రావడం..ఆ రెండు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవడంతో అమ్మడికి కాస్తంత గుర్తింపు మాత్రమే వచ్చింది.
సంక్రాంతి బరిలో అల వైకుంఠపురములోతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. మరి ఈ మూడు సక్సెస్ లను చూసుకుని అమ్మడు ఎగిరి పడుతుందా? అంటే అవుననే నెటిజనం మండిపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వూలో టాలీవుడ్ నేనే నెంబర్ వన్ అంటూ పుసుక్కున నోరు జారింది. నెంబర్ వన్ హీరోయిన్ అయినందదుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఇదే పోజిషన్ కు చేరుకోవాలని ఆశపడుతున్నట్లు తెలిపింది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పటివరకూ ఏ హీరోయిన్ కూడా చేయలేదు. దశాబ్ధ కాలంగా అనుష్క- సమంత లాంటి నాయికలు ఇక్కడ రాణిస్తున్నారు. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించారు. ఇప్పటికీ పుల్ బిజీగా ఉన్నారు. వస్తోన్న అవకాశాలకు కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి. ఇంకా నయనతార- త్రిష లాంటి ఎక్స్ ప్రెస్సివ్ నటీమణుల్లో సీనియారిటీ ముందు ఎవరూ నిలబడలేరు. వీళ్లు టాలీవుడ్ అవకాశాల్ని కాదని కోలీవుడ్ లో బిజీ అయ్యారు. కానీ ఏ రోజు మేమే నెంబర్ వన్ అని ఎక్కడా నోరు జారలేదు. ప్రచారం చేసుకోలేదు. కానీ బుట్టబొమ్మ ఇలా వచ్చి అలా స్టార్ హీరోయిన్ ని అనేస్తోంది మరి. ఇలా అనగానే అలా తనకు పొగరెక్కువై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని.. అసలు నెంబర్ వన్ అనే పదానికి అర్ధం తెలుసా? అని మండిపడుతూ నెటిజనం విరుచుకుపడుతున్నారు. స్టార్ హీరోయిన్ అన్న హోదాకి ఈ మాత్రం ట్యాలెంట్ కొలమానమా? అంటే కానేకాదు. భారీ పారితోషికాలతో పాటు అన్ని సెక్షన్ల ఆడియెన్ నుంచి మెప్పు పొందితేనే స్టార్ హీరోయిన్. ఇక ఇప్పటివకూ పూజాకి చెప్పుకోదగ్గ అవార్డులు కూడా వచ్చిందేం లేదు. అప్పుడే తనని తాను పెద్ద రేంజులో ఊహించేసుకుంటోంది.