హరీష్ శంకర్.. ఆమెనూ మార్చేశాడే

Update: 2017-05-30 10:04 GMT
హీరోయిన్లను అందంగా.. సెక్సీగా చూపించి వాళ్ల కెరీర్లకు కొత్త కళ తీసుకొచ్చే దర్శకులు కొందరుంటారు. ఈ కోవలో ఒకప్పుడు ప్రధానంగా రాఘవేంద్రరావు గురించి మాట్లాడుకునే వాళ్లు. ఆపై కృష్ణవంశీకి కూడా ఈ విషయంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ తరం దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా.. హీరోయిన్లను ప్రత్యేకంగా చూపిస్తాడని పేరుంది. ‘గబ్బర్ సింగ్’లో శ్రుతి హాసన్.. ‘మిరపకాయ్’లో రిచా గంగోపాధ్యాయ.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రెజీనాలను చాలా సెక్సీగా చూపించి.. వాళ్ల ఇమేజ్ మార్చేసిన ఘనత హరీష్ శంకర్ దే. ఇప్పుడు పూజా హెగ్డేకు కూడా తనదైన టచ్ ఇచ్చినట్లున్నాడు హరీష్.

‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ టీజర్లో పూజాను చూసినప్పుడే ఆమె చాలా కొత్తగా కనిపించింది. ముకుంద.. ఒక లైలా కోసం లాంటి సినిమాల్లో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది పూజా. ఆమెకు ఇప్పటిదాకా క్యూట్ హీరోయిన్ అన్న ముద్రే ఉంది. కానీ ‘డీజే’తో హాట్ హీరోయిన్ అయిపోయేలా ఉంది పూజా. నిన్ననే రిలీజైన ‘బడిలో గుడిలో మదిలో...’ పాటలో పూజాను చూసి కుర్రాళ్ల మతిపోయింది. ఇందులో పూజాతో ఎక్స్ పోజింగ్ ఏమీ చేయలేదు కానీ.. చాలా సెక్సీగా కనిపించింది. ఆమె డ్రెస్సులు.. స్టెప్పులు కొత్తగా అనిపించాయి. కుర్రాళ్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంతకుముందు తెలుగులో చేసిన రెండు సినిమాలు పూజాకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. పైగా మధ్యలో బ్రేక్ తీసుకుని బాలీవుడ్ కు తిరిగెళ్లిపోవడం కూడా మైనస్ అయింది. ఐతే ‘డీజే’ లాంటి క్రేజీ ప్రాజెక్టులో రీఎంట్రీ ఇస్తున్న పూజా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇక ఆమెకు తిరుగుండదేమో. అసలే హీరోయిన్ల కొరత టాలీవుడ్లో పెరిగిపోతున్న నేపథ్యంలో పూజా స్టార్ హీరోయిన్ గా మారేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News