మొత్తానికి హీరోయిన్ పూజా హెగ్డే ట్రెండ్ ఇప్పుడు మామూలుగా లేదు. మాంచి స్టార్ డం క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలను కూడా ఒప్పుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా మరో సినిమాలో నటించేందుకు పూజాహెగ్డే అంగీకారం తెలిపింది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి – రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘సింబా’ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తెలుగులో ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాకు రీమేక్ ఇది. సింబా చక్కటి విజయం సాధించడంతో ఆ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టి ఈ సారి పూర్తిగా ఒక ఎంటర్ టైన్ మెంట్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. హిందీ లో ప్రముఖ కామెడీ సినిమా అయినా గోల్ మాల్ ఫ్రాంఛైజీ కన్నా వినోదాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్ దర్శకుడు చేస్తున్నారు. ఈ సినిమాకి ఇప్పటికే సర్కస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందులో పూజా హెగ్డే తో పాటు మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. ఈ సినిమాను రోహిత్ శెట్టితో పాటు భూషణ్ కుమార్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కలసి నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే ప్రభాస్ తో రాధే శ్యామ్ తోపాటు యంగ్ హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, హిందీలో కబీ ఈద్ కబీ దివాళి తదితర సినిమాల్లో నటిస్తోంది. ఈ భాష ఆ భాష అని లేకుండా దూసుకెళ్తోంది.