టాప్ అందాలతో బుట్టబొమ్మ మైండ్ బ్లాక్

Update: 2022-06-19 03:30 GMT
టాలీవుడ్ బుట్టబొమ్మ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పూజాహెగ్డే సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక పోటీగా ఎంతమంది బ్యూటీలు వచ్చినా కూడా మరొక రెండేళ్ల వరకు అమ్మడిని ఎవరు డామినేట్ చేయలేరు అని చెప్పాలి. ఎందుకంటే ఆమె ఆ తరహాలో అగ్ర హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీలో కూడా పెద్ద సినిమాలతో బిజీగా ఉంది. కాబట్టి మరో రెండు మూడేళ్ల వరకు స్టార్ హీరోయిన్ స్థానానికి డోకా ఉండదనే చెప్పాలి.

అయితే సినిమాలు ఎన్ని ఉన్నా కూడా తన గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పూజా హెగ్డే ఇలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతుంటాయి.

బుట్టబొమ్మ గ్లామర్ డోస్ కాస్త పెంచిన కూడా అవి ఏ రేంజ్ కి వెళ్తాయి ఊహించడం కష్టమే. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ టాప్ అందాలతో మరోసారి షాక్ ఇచ్చింది. తెల్లని చొక్కా లో తన క్లీవేజ్ అందాలను హైలెట్ చేస్తూ దిమ్మతిరిగేలా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన కుర్రాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు.

పూజా హెగ్డే గ్లామర్ ప్రజెంటేషన్ లో తనకు తానే పోటీ అని మరొకసారి నిరూపించుకుందని కూడా చెబుతున్నారు. ఇక ఇటీవల రెండు మూడు నెలల్లోనే పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ సంఖ్య అమాంతంగా పెంచేసుకుంది. ఆ రూట్లో కూడా ఈ బ్యూటీ చాలా మంచి ఆదాయాన్ని అందుకుంటోంది.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు. ఇక సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ కు ఈ బ్యూటీ లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. నెక్స్ట్ తెలుగులో మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News