పూజా ఫిలాసఫీయే వేరు

Update: 2018-04-19 04:47 GMT
ఉదయాన్నే నిద్ర లేవడం.. పద్ధతిగా రెడీ అయిపోవడం.. ఆఫీస్ కెళ్లి పంక్చువల్ గా పని చేసుకోవడం.. సాయంత్రం అయ్యేసరికల్లా ఇంటికి రావడం.. తొమ్మిదయ్యేసరికి పడుకోవడం... ఇంత రొటీన్ భరించడం కష్టం. చేసే పనిలో కొత్తదనం ఉండాలి. రోజూ ఒకేలా ఉండమంటే అయ్యే పనికాదు. ఇదంతా చూస్తుంటే రవితేజ సూపర్ హిట్ మూవీ కిక్ లో డైలాగ్ గుర్తొస్తుందా? అదేం కాదు ఇది బికినీలతో హీట్ పుట్టించిన టాప్ హీరోయిన్ పూజా హెగ్డే నమ్మే ఫిలాసఫీ.

జిగేల్ రాణి గా రంగస్థలం మూవీలో ఐటం సాంగుతో అందరినీ మురిపించిన ఈ భామ సినిమా ఫీల్డ్ తన మైండ్ సెట్ కు బాగా సూటవుతుందని అంటోంది. ఎందుకంటే సినిమాల్లో రోజూ ఓ కొత్త సీన్ చేయాల్సి వస్తుంది. కొత్త ఎక్స్ పీరియన్స్ వస్తుందని పూజా అంటోంది.‘‘నాకు ప్రతిరోజూ కొత్తగా అనిపించాలి. ఖాళీ దొరికినా అప్పటికప్పుడు ఏం చేయాలని అనిపిస్తుందో అదే చేస్తా. ఒకవేళ నేను యాక్టర్ ను కాకపోయినా ఏదో ఒక ప్రొఫెషన్ ను అంటిపెట్టుకుని ఉండేదాన్నిమాత్రం కాదు’’అని పూజా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా మంచి జోరుమీదుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేసిన సాక్ష్యం రిలీజుకు సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ పక్కన పూజాయే హీరోయిన్ గా చేస్తోంది.  


Tags:    

Similar News