చెల్లి పెళ్లి చూసి.. నాకనుకుంటే ఎలా?

Update: 2016-05-01 09:36 GMT
మొదటి సినిమా అనే టైటిల్ పై వచ్చిన సినిమాతోనే తెరంగేట్రం చేసిన పూనమ్ బజ్వా.. ఆ తర్వాత కోలీవుడ్ లో బాగానే సెటిల్ అయింది. ఇక్కడ అల్లు అర్జున్ పరుగు - నాగార్జున బాస్ లాంటి సినిమాల్లో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ.. తమిళ్ లో మాత్రం వరుస సినిమాలతో బిజీగానే ఉంది. రీసెంట్ గా వచ్చిన అరణ్మణై2 లో కూడా పూనమ్ సందడి చేసింది.

అయితే.. ఈ పూనమ్ ఇప్పుడు పెళ్లి చేసేసుకుందనే టాక్ మొదలైంది. నాలుగు రోజుల క్రితం టాలీవుడ్ డైరెక్టర్ సునీల్ రెడ్డిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందని అంటున్నారు. గంగపుత్రులు లాంటి సినిమాతో ట్యాలెంటెడ్ దర్శకుడు అనిపించుకున్న సునీల్ రెడ్డి ఖాతాలో.. చాలానే మూవీస్ ఉన్నాయి. ఇదో ప్రైవేట్ కార్యక్రమంగా జరపడంతో.. ఎవరినీ పిలవలేదనే టాక్ కూడా వినిపించింది. అయితే.. అసలు తనకు పెళ్లే కాలేదంటోంది పూనమ్ బజ్వా. ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే సరైన సమయంలో అందరికీ చెప్పే చేసుకుంటానని.. సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంటోంది.

'మా చెల్లి దయా పెళ్లి చేసుకుంది. దాన్ని చూసి అంతా నా పెళ్లి అనుకున్నారు. నాకు సునీల్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్. అనవసరంగా అతన్ని ఈ వ్యవహారంలోకి లాగారు' అంటున్న పూనమ్.. ప్రస్తుతం సుందర్ సి లీడ్ రోల్ లో చేస్తున్న ఓ తమిళ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసింది.
Tags:    

Similar News