ఒక్క అవకాశం ఇవ్వండయ్యా

Update: 2016-03-22 13:30 GMT
పూనమ్‌ కౌర్‌. ఎప్పుడో చిన్నప్పుడు హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. కాని ఒక్కసారి కూడా ఆమెకు లక్‌ తిరగలేదు. దానితో కొన్ని సంవత్సరాల క్రితం చెల్లెలు క్యారెక్టర్లకు.. సైడ్‌ రోల్స్‌ కు కూడా సై అనేసింది. అయినా మనోళ్ళు కనికరించలేదు. బొద్దుగా మారిపోయింది. కాకపోతే హాట్‌ హాట్‌ ఫోటోషూట్లతో పలకరించింది. అయినా ఫలితం శూన్యం.

అయితే ఈ మధ్యనే అమ్మడు బాగా సన్నబడి.. ఏకంగా ముంబాయ్‌ కు మకాం మార్చేసి.. అక్కడ బిపాసా బసు కొత్త ప్రియుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ తో ఒక సినిమాలో హీరోయిన్‌ గా చేస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ అయ్యి మరి బాలీవుడ్‌ లో ఏమాత్రం ఏలుతుందో తెలియదు కాని... టాలీవుడ్‌ లో మాత్రం ఆ మధ్యన ఈమెకు బ్రేక్‌ ఇవ్వడానికి రామ్‌ గోపాల్‌ వర్మ ముందుకొచ్చాడు. మనోడు ''ఎటాక్‌'' సినిమాలో ఈమెను విలన్‌ గాళ్‌ ఫ్రెండ్‌ గా పెట్టుకున్నాడు. ఈరోజు సినిమా రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ మెంట్‌ మీటింగుకు స్లిమ్‌ అండ్‌ ట్రిమ్‌ లుక్‌ లో వచ్చిన పూనమ్‌ చితక్కొట్టేసింది. తన అందాలతో మతి పోగొట్టేసింది. మరి పాపకు 'ఎటాక్‌'తో బ్రేక్‌ వస్తుందా?

అయినా చాలామంది కొత్త ఫేసులకు ఛాన్సులు ఇస్తున్నారు కదా.. మన పూనమ్‌ కు కూడా ఒక ఛాన్సివ్వండయ్యా!!
Tags:    

Similar News