ఈమద్య కాలంలో హీరోయిన్ పూనమ్ కౌర్ రెగ్యులర్ గా మీడియాలో ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆమె ఏం ట్వీట్ చేసినా.. ఏం పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాకు చెందిన ఒక వర్గం వారు పెద్ద ఎత్తున రచ్చ చేయడం మొదలు పెడుతున్నారు. ఆమె పేర్లు చెప్పకుండా కొన్ని విషయాలను ప్రస్థావించడంతో ఆ విషయాలను ఏవో పేర్లు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారు చాలా మంది ఉన్నారు.
ఇటీవల 'నాతిచరామి' అనే సినిమా లో పూనమ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ పూనమ్ ఎమోషనల్ అయ్యింది. ఆ సమయంలో కొందరు తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. తాను విదేశాలకు వెళ్లి పోవాలని భావించాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ నార్మల్ గా మాట్లాడి కార్యక్రమంను ముగించింది. ఆ విషయంలో ఇప్పుడు రచ్చ రచ్చ జరుగుతోంది.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు పూనమ్ ఏడిచిన విషయంపై రక రకాలుగా రచ్చ మొదలు పెట్టారు. పూనం ఏడుపు వెనుక కారణం ఏంటీ... ఆమె ఎందుకు ఏడ్చింది.. ఆమె ఏడుపుకు కారణం ఆ ఇద్దరేనా అంటూ రకరకాలుగా ఆమె ను గురించి యూట్యూబ్ లో కథనాలు అల్లడం జరిగింది.
ఆమె చాలా కాలం తర్వాత ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఏడ్చి ఉండవచ్చు అనే భావన లేకుండా ఆ ఇద్దరి వల్ల అంటూ ఇండస్ట్రీ ప్రముఖుల పేర్లు పెట్టి కథనాలు అల్లడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే సమయంలో పూనమ్ కౌర్ స్పందించింది. నాతి చరామి సినిమా ప్రెస్ మీట్ లో నేను మాట్లాడినదాన్ని వక్రీకరించి ఎవరైతే థంబ్‌నెయిల్ పెట్టారో వాటన్నింటిని సేవ్ చేయడం జరిగింది. త్వరలోనే వాటితో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. నేను మాట్లాడని విషయాలను నాకు సంబంధించిన వ్యక్తుల గురించి థంబ్‌నెయిల్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను అంటూ ఆమె హెచ్చరించింది.
పూనమ్ కౌర్ గురించి ఇలాంటి ప్రచారాలు ఈమద్య కాలంలో ఎక్కువ అవుతుండటంతో ఆమె ఈసారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దం అయ్యింది. యూట్యూబ్ ఛానల్స్ మరీ ముఖ్యంగా ఆమెను టార్గెట్ చేస్తుండటంతో ఈ నిర్ణయానికి తను వచ్చిందంటూ ఆమె సన్నిహితులు అంటున్నారు.
నాతిచరామి సినిమా ప్రెస్ మీట్ లో అసలు పూనమ్ ఎందుకు ఏడ్చింది అంటూ కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పూనమ్ హెచ్చరికలతో ఇప్పుడు అంతా కూడా కాస్త సైలెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.