ప్రముఖ కమెడియన్‌ గుండెపోటుతో మృతి

Update: 2022-09-21 06:22 GMT
ప్రముఖ కమెడియన్ రాజు శ్రీ వాస్తవ గుండె పోటుతో నేడు ఉదయం మృతి చెందారు. స్టాండప్ కమెడియన్ గా సుదీర్ఘ కాలం గా ఎన్నో షో లు చేసి మంచి గుర్తింపు దక్కించుకున్న రాజు శ్రీ వాస్తవ ఇటీవల గుండె పోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు.

అక్కడ చికిత్స పొందుతున్న శ్రీ వాస్తవ కోలుకుంటాడని కుటుంబ సభ్యులు మరియు అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించి చికిత్సకు కూడా స్పందించలేదని వైధ్యులు అన్నారు.

నేడు ఉదయం శ్రీ వాస్తవ మృతి చెందినట్లుగా వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు నెలలో జిమ్ చేస్తూ ఉండగా శ్రీ వాస్తవ గుండె పోటుకు గురయ్యారు. ఆయన చికిత్స నిమిత్తం జిమ్‌ ట్రైనర్‌ వెంటనే హాస్పిటల్‌ కు తీసుకు వెళ్లారు. ఆయన ఆరోగ్యం అప్పటి నుండి మెరుగు పడలేదని సన్నిహితులు చెబుతున్నారు.

బ్రెయిన్ డెడ్ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆయన సన్నిహితులు మరియు వైద్యుల నుండి గత కొన్ని రోజులుగా ఎలాంటి స్పందన హడావుడి లేకపోవడంతో శ్రీ వాస్తవ కోలుకుంటున్నాడు అని అంతా అనుకుంటూ ఉన్నారు. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని భావించలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజు శ్రీ వాస్తవ మృతికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News