అన్నదమ్ములను ఇక నమ్మమంటున్నారు

Update: 2019-06-04 05:16 GMT
అవును ట్రేడ్ నుంచి విన్పిస్తున్న మాట ఇది. ఒకప్పుడు తమిళ్ బ్రదర్స్ గా మంచి మార్కెట్ సంపాదించుకుని ధీటైన వసూళ్లు తెచ్చుకున్న సూర్య కార్తిలకు ఇప్పుడు ఇక్కడ చాలా బ్యాడ్ మార్కెట్ ఏర్పడింది. కారణం వాళ్ళ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లకు అర్థాలుగా మారడమే. ఇటీవలే విడుదలైన ఎన్జికె ఫస్ట్ వీకెండ్ లో 3 కోట్ల 50 లక్షల షేర్ తేవడానికే నానా తంటాలు పడింది. జరిగిన థియేట్రికల్ బిజినెస్ మొత్తం 9 కోట్లలో సగమైనా వస్తుందన్న నమ్మకం బయ్యర్లలో లేదు.

విపరీతమైన నెగటివ్ టాక్ సోమవారం నుంచి పరిస్థితిని ఇంకా దిగాజార్చేసింది. రెండు నెలల క్రితం వచ్చిన సూర్య తమ్ముడు కార్తి సినిమా దేవ్ కూడా ఇదే తరహ ఫలితాన్ని అందుకోవడం ఎవరూ మర్చిపోలేదు. ఆకర్షణలు ఎన్ని ఉన్నా కంటెంట్ విషయంలో ఇద్దరూ దారి తప్పడం అభిమానులను కలవరపరుస్తోంది. ఒక్కసారైనా చూడొచ్చు అనేలా కూడా వీళ్ళ సినిమాలు లేకపోవడం ప్రధాన సమస్య

సో ఇప్పుడు అన్నదమ్ముల సినిమాలంటేనే మీకో దండం అనే పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం కార్తి కొత్త సినిమా ఖైదితో పాటు సూర్య కాప్పన్ (తెలుగు టైటిల్ డిసైడ్ కాలేదు)ల మీద తీవ్రంగా పడేలా ఉంది. వీటిలో మ్యాటర్ ఉందో లేదో తెలియకపోయినా ఇకపై మాత్రం అంతేసి పెట్టుబడులు పెట్టె సమస్యే లేదని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.

ఇదిలాగే కొనసాగితే అసలు నిర్మాతలే స్వంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు ముందుకు రాని కారణంగా ధనుష్ గత కొంత కాలంగా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. గజినీతో సూర్య నా పేరు శివతో కార్తి ఏర్పరుచుకున్న మార్కెట్ మొత్తం పడిపోయింది. ఇది మళ్ళి మొదటికి రావడం ఇప్పట్లో జరిగే పని కాదు కాని కనీసం యావరేజ్ సినిమాలతో అయినా వస్తే అభిమానులకు ఊరట కలిగించిన వారవుతారు

    

Tags:    

Similar News