గత ఏడాది చివర్లో ‘దంగల్’ రూపంలో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఆమిర్ ఖాన్. ఇంతలోనే ఆయన ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయమంటున్నారు. ఆమిర్ కొత్త సినిమా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ విడుదలకు ముందే అద్భుతమైన రివ్యూలు తెచ్చుకుంటోంది. ఆమిర్ ఓ కీలక పాత్ర పోషిస్తూ తన నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అద్వైత్ చౌహాన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
‘దంగల్’లో ఆమిర్ కూతురిగా నటించిన జైరా ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. ఓ అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం. కానీ ఆమె తల్లిదండ్రులు తనను ప్రోత్సహించారు. ఈ పరిస్థితుల్లో బురఖా ధరించి.. తనెవరో కనిపించకుండా.. ఓ అజ్నాత వ్యక్తిలా యూట్యూబ్ లోకి వచ్చిన తన ప్రతిభను అందరికీ చాటి చెప్పేలా చేస్తుంది. ఈ కథాంశంతో ఎంతో ఇన్ స్పైరింగ్ గా ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందించాడట దర్శకుడు అద్వైత్. కథల ఎంపికలో ఆమిర్ మరోసారి తన అభిరుచిని చాటుకున్నాడని.. ఈ ఏడాది ఇండియాలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఇదొకటని అంటున్నారు.
ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి అయితే ఈ ఏడాది బాలీవుడ్ బెస్ట్ మూవీ ఇదే అని తీర్పిచ్చేశాడు. ఆల్రెడీ ఈ సినిమా రివ్యూలు కూడా బయటికొచ్చేశాయి. అందరూ ఆమిర్.. అద్వైత్.. జైరాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ గురువారమే ‘సీక్రెట్ సూపర్ స్టార్’ రిలీజవుతోంది. మరి విడుదల తర్వాత ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.